అదిలాబాద్

బతుకమ్మ పండుగా... పేదింట పుష్పాల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 18: నిరుపేద కుటుంబాల వారు దసరా పండుగను ఆపూర్వంగా జరుపుకుంటారని బతుకమ్మ పండుగ ఆడపడుచులకు పెద్ద పండుగా పెద్దపల్లి పార్లమెంటరీ సభ్యులు బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదింటి మహిళల కోసం ప్రవేశ పెట్టిన బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మన పండుగలను అప్పటి ప్రభుత్వం గుర్తించేది కాదని, రాష్ట్రం ఏర్పడ్డాక మన పండుగలకు ప్రాదాన్యత పెరిగిందన్నారు. ప్రకృతిని పూజించేపండుగా బతుకమ్మ పండుగా అని టీ ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా సంబరాలు నిర్వహిస్తుందన్నారు. ముఖ్య మంత్రి కేసి ఆర్ పేద ఇంటి ఆడబిడ్డల కోసం చీరల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారని ఆందోలో భాగం జిల్లాలో 2,54,890 లబ్దిదారులు ఉన్నారని సోమవారం నుండి మూడు రోజుల పాటు చీరల పంపిణి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. పండుగ అనందాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేసి ఆర్ ప్రభుత్వ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణికి శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ కార్డులో పేరుండి 18 యేండ్లు నిండిన మహిళలకు ఉచితంగా చీరలు అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో రంజాన్, క్రిస్టమస్ పండుగల సందర్బాల్లో దుస్తులు పంపిణి చేసిన ప్రభుత్వం తాజాగా బతుకమ్మ కానుకగా తొలిసారి ఆడబిడ్డలకు చీరల పంపిణి పథకాన్ని అంకురార్పణ చేసిందన్నారు.కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు చీరలు అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. ఈ పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లాకలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ చైర్ పర్సన్ వసుందర, జిల్లా మహిళా నాయకురాలు అత్తి సరోజా, వ్యవసాయ మార్కెట్‌కమిటి చైర్మన్ సాగె వెంకటేశ్వర్‌రావు, కౌన్సిలర్లు కారుకూరి చంద్రవౌళి, శఫీ, నాయకులు చంధ్రశేఖర్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
చీరల పంపిణీలో మహిళల నిరసన
జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పలువురు మహిళలు నాణ్యత లేని చీరలు పంపిణి చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని నాలుగవ వార్డుకు చెందిన బోడిగ లక్ష్మి అనే మహిళా నాసిరకంగా ఉన్న చీరలను మాకెందుకు పంపిణి చేస్తున్నారని అన్నారు. నిన్నటి వరకు టీవీల్లో నేచిన చీరలు పంపిణి చేస్తామని నాణ్యత లేని ఉత్పత్తులు అందించడం ఎంత వరకు సమంజసం అని పంపిణి కేంద్రం వద్దే అధికారులను నిలదీసింది.