అదిలాబాద్

అణగారిన వర్గాల ఆరాధ్యుడు జగ్జీవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్‌రాం అని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కొనియాడారు. పట్టణంలోని ఆర్డివొ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం బాబు జగ్జీవన్‌రాం 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అథితిగా హాజరై దేశానికి జగ్జీవన్‌రాం చేసిన సేవలను కొనియాడారు. 1908 ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రాం బీహార్‌లోని వెనుకబడిన వర్గాల్లో జన్మించాడన్నారు. భారత పార్లమెంటులో 40 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులను నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా పనిచేశారన్నారు. ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారని కొనియాడారు. విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్థ నాయకుడిగా, కరువుకోరల్లో చిక్కిన భారతావనిని వ్యవసాయ మంత్రిగా, హరిత విప్లవాన్ని సాకారం చేసి దేశంలోని పేద ప్రజల కడుపునింపిన మహానీయుడు బాబు జగ్జీవన్‌రాం అని కొనియాడారు. బాబు జగ్జీవన్‌రాంది దళిత కుటుంబం కావడంతో నాటి కులసమాజపు అవమానాలెన్నో చవిచూశారని, నాటి అంటరానితనమే ఆయనను సమతావాధిగా మార్చిందన్నారు. నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం, గాంధీజి నాయకత్వంలో జరిగిన సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలను నిశితంగా గమనించడం వల్ల విద్యార్థి దశనుండే అహింసవాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు సైతం తిన్నారన్నారు. ఒకవైపు కులం అణచివేతను అధిగమిస్తూనే భారత స్వాతంత్ర పోరాటంలో మొక్కవోణి ధైర్యాన్ని ప్రదర్శించి నాటి జాతీయ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేయడం జరిగిందన్నారు. దళితహక్కుల పరిరక్షణలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్‌తో కలిసి దళితోద్దారకుడిగా పేరొందిన జగ్జీవన్‌రాం ఏనాడు తలవంచని వ్యక్తిత్వంతో చివరి వరకు నిలిచాడని కొనియాడారు. ప్రజల మద్య, ప్రజల కోసం సేవచేసిన ఆయన 1986 జులై 6న మరణించారని తెలిపారు. ఆయన ఆశయాలు, సిద్దాంతాల కోసం నేటి రాజకీయ నాయకులు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి మహానేత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పిలుపునిచ్చిందని, ఇందులో భాగంగానే ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. నిర్మల్‌లో బాబు జగ్జీవన్‌రావు విగ్రహ ఏర్పాటుకు కృషిచేస్తానని మంత్రి హామీనిచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసి ఆర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రిచే ప్రకటన చేయించి ఏడాదిలోపే పనులు పూర్తిచేస్తామని అల్లోల హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసి ఎం ఎస్ ఛైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డివొ శివలింగయ్య, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ అజింబిన్ యాహియా, తహసిల్దార్ నారాయణ, నాయకులు రాజేందర్, పాకాల రాంచందర్, ముత్యంరెడ్డి, జీవన్‌రెడ్డి, వంజరి శ్రీనివాస్‌రెడ్డి, టి ఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్, కలాంగుణం సొసైటి అధ్యక్షులు మహ్మద్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.