అదిలాబాద్

మంత్రి రామన్నను కలిసిన అంబేద్కర్ మనుమళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 22: ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన దమ్మ చక్ర పరివర్తన్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ అంబేద్కర్ మనువడు అశోక్ ముక్రాస్ అంబేద్కర్, ముని మనువడు రాజ్త్రన్ అంబేద్కర్‌లు మంత్రి జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనకబడిన మాలీ కులస్తులకు అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చేలా, సామాజిక రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేయాలని మంత్రిని కోరారు. దళితవర్గాల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. అనంతరం ముక్రాస్ అంబేద్కర్, రాజ్త్రన్ అంబేద్కర్‌లు దళిత సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట రత్నాజాడె ప్రజ్ఞాకుమార్, కమలబాయి, వాగ్మారే గైక్వాడ్, సర్పంచ్ మస్కె తేజ్‌రావ్ తదితరులు ఉన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* ఎమ్మెల్యే రేఖానాయక్
జన్నారం, అక్టోబర్ 22: పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఆదివారం మండల కేంద్రంలో ఎఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60ఏళ్ల పాలనలో చేపట్టని అభివృద్దిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం మూడేళ్ళకాలంలోనే చేసి చూపించిందన్నారు. అన్నివర్గాల అభివృద్దే ద్యేయంగా ముఖ్యమంత్రి కెసి ఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 75 శాతం ఇప్పటివరకు అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సిహెచ్ రాజేశ్వరి సత్యం, మండల పార్టీ అధ్యక్షుడు భరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి జాడి గంగాధర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ సతీష్, నాయకులు హన్మంతరావు, రాజన్నతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షానికి పంటల నష్టం
కుంటాల, అక్టోబర్ 22: మండల కేంద్రమైన కుంటాల గ్రామంతోపాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలకు నష్టం వాటిల్లిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చేతికి వచ్చిన సోయాపంట కల్లాలపై ఉండడంతో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని వారంటున్నారు. చేతికి వచ్చిన పత్తిపంట పూర్తిగా నేలమట్టమైందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం తడిసిన పంటలను నిర్ణయించిన ధరలకే కొనుగోలుచేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

చిత్రలేఖనం పోటీలో సన్‌షైన్ విద్యార్థిని ప్రతిభ
ఉట్నూరు, అక్టోబర్ 22: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉట్నూరులో నిర్వహించి న చిత్రలేఖనం పోటీల్లో స్థానిక సన్‌షైన్ ఇంగ్లీష్ మీడియంలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని సహస్ర జిల్లా స్థాయలో మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు వివిధ మండ లాల్లో చిత్రలేఖనం పోటీలు నిర్వహిం చారు. ఈమేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్య క్రమం లో అటవీ, బిసి సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ జ్యోతి బుద్ధప్రసాద్, ఎస్పీ శ్రీనివాస్, మున్సి పల్ చైర్మన్ మనీషా పవన్‌కుమార్ చేతుల మీదుగా విద్యార్థిని సహస్రకు ప్రశంసాపత్రంతోపాటు ప్రథమ బహు మతి అందజేశారు. ఎస్‌ఐ మంగీలాల్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో సహస్ర అత్యంత ప్రతిభ కనబరచి జిల్లా స్థాయలో మొదటి బహుమతి కైవశం చేసుకోవ డంతో పాఠశాల కరస్పాండెంట్ షేక్‌షబ్బీర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు అభి నందించారు.