అదిలాబాద్

దీపం పథకానికి భూసర్వే గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 16: ఇది వరకు వంటగ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు ప్రభుత్వమే ఉచితంగా ఆహారభద్రత కార్డుల కింద గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నీరుగారిపోతోంది. రెవెన్యూ అధికారులు భూసర్వే పేరిట క్షేత్రస్థాయిలో బిజీగా గడుపుతుండగా మరోవైపు గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనే 27వేల మంది ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని రెండున్నర నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా వీరి సమస్యపై ఏమాత్రం కనికరించడం లేదు. ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి, వెనువెంటనే కనెక్షన్లు అందిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు సాగించగా ఆదిలాబాద్ జిల్లాలో 76,507 కుటుంబాలు కట్టెలపోయిపైనే ఆధారపడుతున్నారని తేల్చారు. దీంతో వీరందరికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ఆదిలాబాద్ జిల్లాలో 27వేల 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో అధికారులు అతికష్టం మీదా 9685 మాత్రమే కంప్యూటర్లలో అప్‌లోడ్ చేసుకోగా 570 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. అయితే అప్‌లోడ్ అయిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా ఆమోదం పొందిన కనెక్షన్లు ఇవ్వాలని నిబంధనలు ఉండగా ఇంత వరకు వీటిని అందించకపోవడంతో బాధితులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పేద, దళిత గిరిజన కుటుంబాలు మొత్తం లక్షా 82వేల 166 కుటుంబాలు ఉండగా వీరికి ఆహార భద్రత కింద పౌర సరఫరాల శాఖ ద్వారా కార్డులు అందించారు. అయితే వీటిలో సగం మంది కట్టెల పోయి ద్వారానే వంటలు చేసుకుంటున్నట్లు తేలడంతో వీరందరికి గ్యాస్ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగి ఉన్న కుటుంబాల్లో లక్షా 5వేల 700 మంది కుటుంబాలు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉండగా మిగిలిన 76,507 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేదు. వీరంత దీపం పథకం కింద ఉచిత కనెక్షన్లు పొందేందుకు అవకాశం కల్పించినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం దీపం పథకంపై స్పందించకుండా భూదస్త్రాల శుద్దీకరణ పేరిట గ్రామాలకు వెళ్తుండడంతో నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించిన దరఖాస్తులను కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండగా తమకు ఇతర రెవెన్యూ సమస్యలు అధికంగా ఉండడంతో అప్‌లోడ్ చేయలేకపోతున్నామని అధికారులు తేల్చిచెబుతున్నారు. భూసర్వే డిసెంబర్ 15 వరకు కొనసాగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందే అవకాశం లేకుండా పోయింది. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిసారించి మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.