అదిలాబాద్

గోండుకోటను సందర్శించిన టూరిజం అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, ఏప్రిల్ 10: టూరిజం, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు ఆదివారం కొమరంభీం ప్రాంగణం సమీపంలోని పురాతన గోండు కోటను సందర్శించారు. ఈ సందర్శనలో ఇన్‌ప్రాస్ట్రక్చర్ డెవలఫ్‌మెంట్ కార్పొరేషన్, టూరిజం శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గోండు కోటను సందర్శించి కోటలో ఉన్న కోనేరు, చుట్టూ ప్రహారిగోడ, బుర్జులను పరిశీలించారు. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న గిరిజనుల సంస్కృతి, పర్యాటక స్థలం, గోండు రాజుల కోటలకు పునర్‌వైభవం తీసుకరావడానికి అనువుగా ఉన్న స్థలాలను ఎంపికచేసేందుకు ఈ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లా టూరిజం అధికారి రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమంతా పర్యటించి ప్రాధాన్యత గల అంశాలను పొందుపర్చి నివేదికల రూపంలో ప్రభుత్వానికి వివరిస్తామని అన్నారు. ఉట్నూరులో ఉన్న రాజుల కోట, కోనేరు, కోటలోని ప్రదేశాలు, ప్రహారి, కందకాలను పరిశీలిస్తామని, ఇక్కడికి టూరిజంకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఏపివో జనరల్ నాగోరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, ఐటిడిసి శ్రీనివాస్, జనరల్ మేనేజర్ శ్రీదేవి, టీం లీడర్, ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్ పాల్గొన్నారు.