అదిలాబాద్

17న జరిగే ఎస్సై రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 10: ఈనెల 17న ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించే ఎస్సై ప్రాథమిక రాతపరీక్షకు ఏర్పాట్లు పకడ్బందీగా గావించామని జిల్లా ఎస్పీ తరుణ్ జోషి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే రాతపరీక్ష కోసం 16 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాగా అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాల కోడ్ నెంబర్‌లను విడుదల చేయడం జరిగిందన్నారు. 1)1101,ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల శాంతినగర్ 2) 1102, నలంద డిగ్రీ కళాశాల మావల రోడ్, 3)1103, విద్యార్థి జూనియర్, డిగ్రీ కళాశాల రవీంద్రనగర్, 4)1104, లిటిల్‌ప్లవర్ ఉన్నత పాటశాల శాంతినగర్, 5)1105, శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల పాత హౌసింగ్‌బోర్డు, 6)1106, వాగ్దేవి ఆర్ట్స్ ఆండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కొత్త బస్టాండ్, 7)1107, చావర ఆకాడమి ఉన్నత పాఠశాల మావల, 8)1108, లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల శాంతినగర్, 9)1109, సిబిఆర్ మోడల్ స్కూల్ శాంతినగర్, 10)1110, ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల 1టౌన్ పోలీసు స్టేషన్, 11)1111, గౌతమి మోడల్ స్కూల్ వినాయక్ చౌక్, 12)1112, తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర జూనియర్ కళాశాల కలెక్టర్ బంగ్ల, 13) 1113, సంజయ్‌గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల డిఎస్పీ క్యాంపు కార్యాలయం, 14) 1114, ఆదిత్య జూనియర్ కళాశాల ఆర్టీసి బస్‌డిపో, 15) 1115, కృష్ణవేణి డిగ్రీ కళాశాల ఆర్టీసి బస్‌డిపో, 16) 1116, రాజీవ్‌గాంధీ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో పరీక్షలు ఉంటాయన్నారు. నిమిషం అలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని, అభ్యర్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థుల తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరాకూడదని అన్నారు. పరీక్షల సమయంలో పట్టణంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. అభ్యర్థులు తప్పుడు మార్గాలను అనుసరించి మాస్‌కాపియింగ్‌కు పాల్పడినా, ఎవరైన సహకరించిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పరీక్షల సమయంలో భారీ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు.