అదిలాబాద్

500 జనాభాతో కొత్త పంచాయతీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి17: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకొత్త పంచాయతీల ఏర్పాటు, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డి.దివ్య బుధవారం అధికారులతో ఇదే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాయతీ ఎన్నికలను గడవుకు ముందే నిర్వహిస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈనెల 25లోగా కొత్త గ్రామపంచాయతీల కోసం తండాలు, గిరిజన గూడేలను ఎంపిక చేసి ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించడం గమనార్హం. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఎంపిడీవోలు, తహసీల్దార్లు, ఈవోపిఆర్‌డిలు, పంచాయతీ కార్యదర్శులతో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, వివిధ అంశాలపై కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. గిరిజన తాండాలు, గూడేలు, హాబిటేషన్ పరిధిలో 500కుపైగా జనాభా కలిగి ఉన్న గ్రామాలను పంచాయతీలుగా గుర్తించేందుకు ఏర్పాట్లు గావించాలన్నారు. ముఖ్యంగా గ్రామపంచాయతీకి రెండు కిలోమీటర్లు, అంతకన్న ఎక్కువ దూరం గల ప్రాంతాలను గు ర్తించి గ్రామపంచాయతీలుగా ప్రతిపాదించాలని కలెక్టర్ సూచించారు. గుట్టలు, వాగులు అడ్డుగా ఉండి ర వాణా సౌకర్యం అంతంతా మా త్రంగా ఉంటే 500 లోపు జనాభా లే దా 300పైన జనాభా కలిగి ఉన్న గ్రామాలను కూడా కొత్త గ్రామపంచాయతీలుగా గుర్తించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలమనోభావాల మేరకు అనువుగా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ప్రభుత్వం గుర్తించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయో, సర్వే నెంబర్లు, భూవివాదాలు పరిశీలించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని ప్రతిపాదనలో నివేదించాలని అన్నారు. పంచాయతీ సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సూచనలు, ప్రతిపాదనలు స్వీకరించి అధికారులు 25 తేదీలోగా కలెక్టర్ కార్యాలయానికి నివేదికలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఈనెల 19న కెస్లాపూర్‌లో జరిగే నాగోబా దర్బార్‌కు తహసీల్దార్లు, ఎంపిడీవోలు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని, దర్బార్‌లో వచ్చిన ఆర్జీలపై అక్కడికక్కడే పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తుందని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ ప్రతిపాదనలు గడవులోగా సిద్దం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇంచార్జి డిపివో జితెందర్ రెడ్డి, ఎంపిడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.