అదిలాబాద్

నాగోబా దర్బార్‌కు లంబాడాలను రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్,జనవరి 17: ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ప్రభుత్వం నిర్వహించే దర్బార్ సమావేశానికి లంబాడా ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఉద్యోగులను హాజరుకానివ్వమని, ఒకవేళ హాజరైనట్లయితే గోబ్యాక్ నినాదాలతో నిరసన తెలుపుతామని తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయికె సంజీవ్ అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగి ంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తుడుం దెబ్బ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో లంబాడాలను చేర్చడం వల్ల అసలైన ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఫలాలు ఆదివాసీలకు అందడం లేదని, రాజ్యాంగ చట్టాలకు విరుద్దంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడాలు ప్రభుత్వ ఫలాలను కొల్లగొడుతూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆదివాసీల మనుగడే ప్రశ్నార్ధకమైందని, ప్ర భుత్వం లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్నారు. తమ డిమాండ్లను సాధించే వరకు శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నాగోరావు, ఆశన్న, జంగుపటేల్, భీంరావు పాల్గొన్నారు.