అదిలాబాద్

యుపీఏ పాలన కుంభకోణాల మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఫిబ్రవరి 18: పదేండ్ల యుపి ఏ పాలన పూర్తిగా అవినీతి, కుంభ కోణాల్లో కూరుక పోయిందని, అక్రమార్కులకు అప్పటి ప్రభుత్వం పూర్తి అండదండలున్నాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు జెబి పౌడెల్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో పౌడెల్‌తోపాటు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తూరి శ్రీనివాస్, సిర్పూర్(టి) జెడ్పీటిసి రామునాయక్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ గౌడ్, బిజెవై ఎం జిల్లా అధ్యక్షుడు విషాల్ ఖాండ్రె, బిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు పి.తిరుపతి పాల్గొన్నారు. ఈసందర్భంగా పౌడెల్ మాట్లాడుతూ మోడీ నాలుగు సంవత్సరాల పాలన అవినీతి మచ్చలేకుండా సాగిందన్నారు. ఒక్క కుంభకోణానికి తావులేకుండా నీతివంతమైన పరిపాలన సాగిస్తున్న ఘనత బిజెపిదే అన్నారు. కాని లక్షల కోట్ల కుంభకోణాలు, బ్యాంకుల మోసాలు యుపిఏ హయాంలో చోటుచేసుకున్నవే అని ఆరోపించారు.
యుపి ఏ పదేండ్ల పాలనలోనే వేలకోట్ల అప్పులను బ్యాంకుల నుండి ఇప్పించడం జరిగిందన్నారు. ఈమోసగాల్లు బ్యాంకులను ముంచడంలో యుపిఏ బాధ్యత వహించాలన్నారు. కామన్‌వెల్త్, బొగ్గుకుంభ కోణం, టుజి స్పెక్ట్రం లాంటి కుంభకోణాలకు అప్పటి యుపి ఏ ప్రభుత్వం నిలయమైందన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పౌడెల్ ఆరోపించారు. ఎన్నికల ముందు కెసిర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాని కేంద్ర ప్రభుత్వ పేదల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జెడి పౌడెల్ పిలుపునిచ్చారు.