అదిలాబాద్

అన్ని వర్గాలకు మహానీయుడు అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్, ఏప్రిల్ 14: అన్నివర్గాల అభ్యున్నతికోసం భారత రాజ్యంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అందరికి మహానీయుడని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని ఐబి చౌరస్తాలో గురువారం బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి వేడుకులు నిర్వహించారు. ఈసందర్భంగా విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బి.ఆర్.అంబేద్కర్ దళితులకే మహానీయుడన్న కొందరిలో అపోహ ఉందని, దానిని దళితులు దూరం చేసి అంబేద్కర్ అన్ని వర్గాల వారికి మహానీయుడని చాటలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యంగం వలనే రైల్వేస్టేషన్‌లో ఛాయ్ అమ్మిన అతి సామాన్య వ్యక్తి అయిన నరేంద్రమోడి భారతదేశానికి ప్రధాన మంత్రి, గుజరాత్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యడన్నారు. భారత రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ వలనే చట్టసభల్లో, రాజకీయల్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ పొంది ఎందరో ఉన్నతస్థాయికి ఎదిగారని ఆయన పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజక కేంద్రంలో కోటి రూపాయలతో అంబేద్కర్ కమ్యూనిటి హాల్ నిర్మాణానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకై అందరు నడుం బిగించి ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు సిఎం కెసిఆర్ పూజ చేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాసాడి శ్రీదేవి, వైస్ ఎంపిపి దుర్గం మంగ, ఎంపిటిసిలు దుగుట స్వప్న, అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.