అదిలాబాద్

మిషన్ భగీరథ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నిర్మల్, మార్చి 20: మిషన్ భగీరథ పనులను గడవులోగా పూర్తిచేసి ప్రతి ఇంటికి తాగునీరందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, పనుల్లో సాగుతున్న నిర్లక్ష్యాన్ని ఇక సహించేది లేదని రాష్ట్ర మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆరణ్యభవన్‌లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ పనుల పురోగతిపై మంత్రులు సమీక్షించారు. నిర్లిప్తవైఖరి విడనాడి అధికారులు వేగిరంగా పనులు పూర్తిచేయాలని, వేసవిలో తాగునీటి కొరత లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై కులంకశంగా చర్చించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలతో పాటు ఆ నియోజకవర్గాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో శాసన సభ్యులు ఓదేలు, పురాణం సతీష్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు మంత్రుల దృష్టికి తెచ్చారు. భగీరథ పనులు వేగవంతం కోసం అవసరాన్ని బట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని 26వేల ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి కనెక్షన్లు అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా యుద్దప్రతిపాదికన పైపులైన్ పనులు పూర్తిచేయాలని, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, మోటారు పంపుల బిగింపు, ఇంట్రావిలేజ్ పనులను నాణ్యతతో చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన శాసన సభ్యులు విఠ్ఠల్ రెడ్డి, కోనప్ప, రేఖానాయక్, మిషన్ భగీరథ ఈ ఎన్‌సి సురెందర్ రెడ్డి, సి ఈవో జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు.