అదిలాబాద్

పోలీసుల సోదాలో 46 వాహనాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మార్చి 21: పట్టణంలోని మహాలక్ష్మీవాడ, చిల్కూరి లక్ష్మినగర్ కాలనీల్లో బుధవారం వందమంది పోలీసులు ఆకస్మికంగా కార్డెన్‌సర్చ్ నిర్వహించి 46 వాహనాలను స్వాధీనపర్చుకున్నారు. వీటిలో 39 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, ఒక టాటా ఏసి వాహనం ఉన్నాయి. ఆదిలాబాద్ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని చిల్కూరి లక్ష్మినగర్, మహాలక్ష్మీవాడల్లో డిఎస్పీ కె.నర్సింహారెడ్డి అధ్వర్యంలో వంద మంది పోలీసులు ఉదయం నాలుగు గంటల పాటు ఆకస్మికంగా కార్డెన్‌సర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డి ఎస్పీ మాట్లాడుతూ కాలనీల్లో అక్రమ కార్యకలాపాలకు, సంఘవ్యతిరేక పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల రక్షణ చర్యల్లో భా గంగా పట్టణంలోని అన్ని కాలనీల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానితులు, నూతన వ్యక్తులపై నిఘా ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీల్లో నిజ ధృవీకరణ పత్రాలు లేని ద్విచక్రవాహనాలు, ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. స్వాదీనం చేసుకున్న వాహనాలు నిజ ధృవపత్రాలు టూటౌన్ పట్టణంలో సమర్పించి వాహనాలను తీసుకొని వెళ్ళవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐలు వి.సురేష్, టి.స్వామి, ట్రాఫిక్ సిఐ డి.్భమయ్య, గ్రామీణ సిఐఏ.ప్రదీప్‌కుమార్, జైనథ్ సిఐ పోతారం శ్రీనివాస్, ఎస్సైలు రమణరావు, బి.అనిల్, గుణవంత్‌రావు, విష్ణు ప్రకాష్, తోట తిరుపతి, ఎస్.రాజు, సుబ్బారావు, మహిళా ఎస్సై పద్మ పాల్గొన్నారు.

క్షయవ్యాధి నియంత్రణకు కృషి చేయాలి
నిర్మల్,మార్చి21: ప్రజలకు క్షయ(టీబీ) వ్యాధిపై అవగాహన కల్పించి దేశం నుండి క్షయవ్యాధిని అంతం చేసేందుకు ప్రతీ ఒ క్కరు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. మార్చి24న ప్రపంచ టీబీ దినోత్సవంను పురస్కరించుకుని వైద్య ఆరోగ్యశాఖ, కార్మికశాఖ, ఆర్‌టీసీ, మున్సిపల్, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ చాంబర్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టీబీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది టీబీ వ్యాధిగ్రస్తుల ఇంటికి వెళ్లి మందులు సరఫరా చేసి వారు మందులువాడేలా, సరియైన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువుతగ్గడం వంటి లక్షనాలున్న వారికి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాన్నారు. టీబీ నిర్ధారణ అయినవెంటనే క్రమం తప్పకుండా వ్యాధిగ్రస్తుడు చికిత్స తీసుకునేలా చూడాలన్నారు. టీబీ వ్యాది మందులతో నయం అవుతుందని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కార్తిక్ మాట్లాడుతూ దేశంలో ప్రతీరోజు 6 వేల మందికి టీవీ వ్యాపిస్తుందని, దీనివల్ల ప్రతీరోజు 600 మంది చనిపోతున్నారని తెలిపారు. 2030 సంవత్సరం నాటికి టీబీని పూర్తిగా అదుపులోకి రావాలని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ప్రపంచదేశాలకు సూచించడం జరిగిందన్నారు. మన దేశంలో 2025 నాటికే టీబీ వ్యాధిని పూర్తిగా అంతం చేయడానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. క్షయవ్యాధి భారినపడేది ఎక్కువగా బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలు, జిన్నింగ్ మిల్లు, టెంబర్, పొగత్రాగేవారని తెలిపారు. వీరందరికి క్షేత్రస్థాయి లో అవగాహన కల్పించడంతోపాటు ఈ నెల 24న నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుండి వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్ వరకు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, విద్యార్థులు, స్వచ్చంద సంస్థలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్ల వైద్య ఆరోగ్యశాఖ అధికారి జలపతినాయక్, జిల్లా కార్మికశాఖ అధికారి ముత్యంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, ఆర్టీసీ, మెప్మా, క్షయ నివారణ శాఖ అధికారులు పాల్గొన్నారు.