అదిలాబాద్

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసారూరల్,మార్చి21: ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నంపెట్టే రైతన్నకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని జె ఎసి ఛైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ కేంద్రంలోని కాటన్ మార్కెట్‌యార్డులో వ్యవసాయ సంక్షోభంపై నిర్వహించిన రైతాంగ సమాలోచన సదస్సులో పాల్గొని రైతులనుద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వానికి కళ్లు తెరిపించి రైతులపక్షాన నిలుస్తానని అన్నారు. చత్తీస్‌ఘడ్, మద్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన రైతు పోరాటాలను గుర్తుచేస్తూ తెలంగాణలోని రైతాంగం ఆ తరహా పోరాటాలు చేసి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రైతులతోపాటు కౌలు రైతుల పరిస్థితి సైతం దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ పంటనష్టపరిహారం సబ్సీడిలు సకాలంలో అందివ్వాలని డిమాండ్‌చేశారు. సబ్సీడి ట్రాక్టర్లు, పనిముట్లు టీ ఆర్ ఎస్ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు. ఐక్య పోరాటాలతో సమస్యలు పరిష్కరించుకునేందుకు పోరాటం కొనసాగిద్దామని ఆయన కోరారు.
రాష్ట్ర సమస్యలు గాలికి వదిలి - థర్డ్ ఫ్రంటా ?
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సమస్యలు, అభివృద్ది వదిలి థర్డ్ ఫ్రంట్ పేరుతో దేశ ఫ్రజలకు న్యాయం చేస్తానని చెప్పడం హస్యాస్పదంగా ఉందని కోదండరాం ఎద్దేవచేశారు. ముందుగా రాష్ట్ర అభివృద్ది, రైతాంగ సమస్యల పరిష్కారానికి దృష్టిసారించాలని ముఖ్యమంత్రికి హితవుపలికారు. రైతులు, నిరుద్యోగులు కేసీ ఆర్ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యావంతుల జిల్లా కన్వీనర్ డాక్టర్ రామకృష్ణగౌడ్, జె ఎసి జిల్లా అధ్యక్షులు విజయ్‌కుమార్, హైకోర్టు న్యాయవాది రచనరెడ్డి, నిజామాబాద్ జె ఎసి నాయకులు భాస్కర్, ఉద్యోగ జె ఎసి నాయకులు శ్రీనివాస్‌రాజ్, టివివి మండల అధ్యక్షులు లస్మన్న, రైతు నాయకులు పురస్తు చిన్నన్న పాల్గొన్నారు.

తాగునీటి పైప్‌లైన్ పగిలి ఇక్కట్లు
నిర్మల్,మార్చి21: నిర్మల్ పట్టణానికి తాగునీరందించే ఎస్సారెస్పీ ఫ్రధాన పైప్‌లైన్ బుధవారం నిర్మల్ పట్టణంలోని శ్యాంఘడ్ జాతీయ రహదారిపై పగిలిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్డుపై నీరుపారుతుండడంతో ద్విచక్ర వాహనదారులకు తృటిలో ప్రమాదం తప్పింది. విలువైన తాగునీరు వృధాగా పోతుండడంతో రోడ్డుపై గుంతలు పడి కారు కొట్టుకుపోయింది. రోడ్డు ఇటీవలే నిర్మించినప్పటికి నాసిరకంగా పనులు చేయడం వల్ల కొద్దిపాటి నీటికే గుంతలుగా మారిందని పలువురు వాపోయారు.

పోలీసులపై విశ్వాసం పెరగాలి
ఆసిఫాబాద్, మార్చి 21: ప్రజల విశ్వాసం చూరగొనేలా ప్రజల పనితీరు ఉండాలని కుమరం భీం జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగనవార్ అన్నారు. జిల్లాకు కేటాయించిన 63 సివిల్, 61 ఏఆర్ కానిస్టేబుల్లతో బుధవారం ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా కల్మేశ్వర్ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలని, పోలీసులంటే సేవాభావంతో పని చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న నూతనత్వం, సాంకేతికతను అనువయిస్తు ముందుకు వెల్లాలన్నారు. మెరుగైన సేవలందించినప్పుడే ప్రజల్లో పోలీసుల ప్రతిష్టను పెంచుతాయని ఎస్పీ అభిప్రాయపడ్డారు. కలిసి కట్టుగా పని చేస్తే మెరుగైన సేవలందించవచ్చని, తద్వారా పోలీసుల గౌరవం పతాక స్థాయికి చేరుతుందన్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ గోద్రు మాట్లాడుతూ జిల్లా నైసర్గిక స్వరూపం వివరించడమే కాకుండా, సరిహద్దుల గురించి తెలియ చేశారు. పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికతను తెలియ చేశారు. ఈకార్యక్రమంలో సిసి కిరణ్ కుమార్, హెడ్‌క్వార్టర్ ఆర్‌ఐలు సంతోష్ కుమార్, శేఖర్ బాబు, శ్రీనివాస్, ఎఎస్‌ఐ జాఫర్, పిఆర్‌ఓ మనోహర్ పాల్గొన్నారు.