అదిలాబాద్

నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, మే 22: నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రం జిత్ దుగ్గల్ ఆదేశించారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని సిసి నస్పూర్ వసతి గృహాంలో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదు అయిన కేసులలో నాన్‌గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీస్ అధికారులతో చర్చించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్, ట్రాఫిక్ సంబంధిత సమస్యలను మహిళ సంబంధిత నేరాలు బాల కార్మికులు, ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ పరివర్తన్, తదితర విషయాలపై రెండు జిల్లాల పోలీస్ అధికారులతో విసృత్తంగా చర్చించారు. సి.సి.టి. ఎస్.ఎస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి దరఖాస్తులను యాప్ ఐ ఆర్ లను పార్ట్ 1, పార్ట్ 2, రిమాండ్, సీడింగ్, చార్జ్‌షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్‌లైన్‌లో ప్రతి రోజు ఎంటర్ చేయాలని ఆదేశించారు. ప్రతి పి ఎస్ లో ఇప్పటి వరకు ఉన్న లాంగ్ పెండింగ్ కేసులను గుర్తించి యూ ఐ కేసులను గుర్తించి కంపోండింగ్ కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు పి ఎస్, టి ఎస్ యాప్ అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారం వెంటనే అందించాలని అదే విధంగా సిసిటి ఎస్ ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెట్టిన కేసులపై ప్రజలకు అవగాహన కల్పించాలని టెక్నాలజీ పరంగా క్రైం మ్యాపింగ్, డ్రాప్ నెట్, బల్క్ ఎస్ ఎం ఎస్ మరియు సిసిటి ఎస్ ఎస్ లపై అవగాహన కలిగి ఉండాలని అన్‌లైన్‌లలో ఎలాం టి పెండింగ్‌లు ఉండరాదని పేర్కొన్నారు. సమావేశంలో పెద్ద పల్లి డిసిసి సుదర్శన్ గౌడ్, మంచిర్యాల డిసిపి వేణుగోపాల్ రావు, ఆడిషనల్ డిసిపి రవి కుమార్, ఏ ఆర్ అడిషనల్ డిసిపి ప్రవీన్‌కుమార్, ట్రైనీ ఐ పి ఎస్ శరత్‌చంద్ర, రమేష్‌బాబు, మంచిర్యాల ఏసిపి గౌస్‌బాబా, పెద్దపల్లి ఏసిపి హాబీబ్‌ఖాన్, జైపూర్ ఏసిపి సీతారాములు, టాస్క్ఫోర్సు ఏసిపి విజయ సారధి, తదితరులు పాల్గొన్నారు.