అదిలాబాద్

రైతుబంధులో తప్పిదాలను సవరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, మే 26: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పెట్టుబడి సాయం, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో తప్పిదాలను సరి చేసి, రైతులకు వందశాతం న్యాయం జరిగే విధంగా చూస్తానని కాగజ్‌నగర్ ఆర్డీఓ రమేష్ బాబు పేర్కొన్నారు. శనివారం చింతలమానేపల్లి తహసీల్ కార్యాలయంలో ఆయన రైతు బంధు కార్యక్రమంపై సమీక్షించారు. మండలానికి మంజూరైన చెక్కులు రైతులకు అందించే చెక్కులపై ఆరా తీయడంతో పాటు పంపిణీ జరగకపోవడానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఎటువంటి తప్పు లు లేకుండా భూ శుద్దీకరణ ప్రకారం రికార్డులను రైతులకు అందజేస్తామన్నారు. మొదటి విడతలో చింతలమానేపల్లి మండలానికి 5930 పట్టా దారు పాస్ పుస్తకాలు మంజూరు కాగా, వీటిలో 4831 పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, వివిధ కారణాలు తప్పుల వల్ల 1009 పాస్ పుస్తకాలు పంపిణీ జరుగకుండా నిలిచి పోయ్యాయని పేర్కొన్నారు. రైతులకు మొదటి విడతలో వచ్చిన ఈ చెక్కులు, పాస్ పుస్తకాలను తప్పులు సరి చేసి సాధ్యమైనంత త్వరగా అందించేందుకు కృషి చేస్తున్నామని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా రెవెన్యూ సిబ్బంది పని చేయాలని ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ నుంచి అన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించి పొరపాట్లను సరి చేస్తామని ఎక్కడ తప్పులు పునరావృత్తం అయిన సిబ్బంది బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తహసీల్దార్ ప్రకాశ్, సీనియర్ అసిస్టెంట్ మృత్యుంజయ్, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
అటవీ అధికారుల దాడులను నిరసిస్తూ ధర్నా
కాగజ్‌నగర్, మే 26: అటవీ అధికారులు తమపై దాడులు చేస్తున్నారని నిరసిస్తూ పట్టణంలోని డివిజనల్ అటవీ కార్యాలయం ముందు సిర్పూర్ టీ. మండలానికి చెందిన పలువురు రైతులు ధర్నా చేసి నిరసన తెలిపారు. శనివారం సిర్పూర్ టీ. మండలంలోని పూసిగూడ, మెట్‌పల్లి, రావన్‌పల్లి, శీలపల్లి, చింతకుంట, తదితర గ్రామాలకు చెందిన రైతుల భారీగా తరలి వచ్చి కాగజ్‌నగర్‌లోని అటవీ కార్యాలయం చేరుకున్నారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న భూములకు లావానీ పట్టాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు బంధు పథకంలో తమ భూములకు పాస్ పుస్తకాలు, చెక్కులు సైతం అందించిందని తమ భూములలో తాము ట్రాక్టర్లతో దున్నుతుంటే అటవీ అధికారులు తమపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్యాలయం ముందు కొద్ది సేపు ధర్నా చేసి తమ నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీ ఓ రమేష్ బాబుకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ ధర్నాలో సిర్పూర్‌టి మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ చౌదరి నానాజీ, షేక్ దావూద్, కొడప ముత్తు, రైతులు పాల్గొన్నారు.