అదిలాబాద్

వర్షం కోసం ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుభీర్, జూన్ 18: మృగశిరకార్తె ఆరంభంలో వర్షాలు అనుకూలంగా కురవడంతో రైతులు సంబరపడ్డారు. పంట సాగుకోసం వ్యవసాయ పనులు ముమ్మరంగా మొదలుపెట్టారు. మృగశిరకార్తె ప్రారంభమైన వారంరోజుల్లోనే రెండు, మూడు భారీ వర్షాలు కురిశాయి. అనుకూలంగా తేమ ఉందని రైతులు సోయా, పత్తి విత్తనాలు వారం రోజుల్లోనే విత్తుకున్నారు. విత్తనాలు నాటుకున్న తర్వాత నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. వేల రూపాయల పత్తి, సోయా విత్తనాలు భూమిలో వేశారు. ఆకాశంలో మబ్బులు కనిపిస్తే చాలు వర్షం కురుస్తుందని ఆశ తో ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురిసి నిలిచిపోయిన మూడు నాలుగు రోజుల్లో పత్తిగింజలను విత్తుకున్నవి మొలకెత్తలేని దుస్థితిలో ఉన్నాయి. తేమ ఉన్న చేళ్లలో మొలకలు మొలకెత్తినా ఎండ వేడిమికి తప్పుకుంటాయో లేదోనని బెంగపడుతున్నారు. తేలికపాటి జల్లులు కురిసిన భూమిలోపల ఉన్న విత్తనాలు మొలకలు వ స్తాయని, మొలకెత్తినవి బతుకుతాయని ఆశతో ఎదురుచూపుతూ చూస్తున్నారు. వర్షాలు లేక కొంతవరకైన నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు.
డీలర్లకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలి
రెబ్బెన, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని డీలర్ల సంఘం అధ్యక్షుడు సాదుల రామయ్య, ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీపతి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం జులై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ పాటించి నిరవధిక సమ్మె చేస్తున్నామని ఈ సందర్బంగా సోమవారం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కమీషనర్ డివి ఆనంద్‌కు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని గత నవంబర్‌లో రేషన్ లిఫ్టింగ్ బంద్ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ సమస్యలను పరిష్కరిస్తామని శాసన సభలో హామీ ఇచ్చారని ఇప్పటి వరకు సమ స్యలు అమలు కు నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకు వచ్చిన రేషన్ డీలర్ల బకాయిలు సుమారు 415 కోట్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నామ మాత్రపు కమీషన్‌లతో బ్రతికి చావలేక కుటుంబాలు పస్తున్న ఉంటున్నామని , అప్పుల పాలు అవుతున్నామన్నారు. కేంద్రం నుండి వచ్చే బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఇప్పటికైనా సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీర్చాలని లేనిచో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగా జులై 1 నుంచి నిరవధిక సమ్మె లో పాల్గొంటామని తెలిపారు. మండలంలోని డీలర్లు పాల్గొన్నారు.