అదిలాబాద్

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 21: మనస్సు, శరీరం, మనోభావాల సంతులనాన్ని సాధించేందుకు యోగాసనాలు ఎంతగానో దోహదపడుతాయని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే ఖచ్చితంగా యోగాసనాలు వేయాలన్నారు. గురువారం స్థానిక వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో ఆయూష్, జిల్లా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన నాల్గవ అంతర్జాతీయ యోగా దినోత్స వ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా యోగా గురువులు అన్నారావు, అన్నపూర్ణల ఆధ్వర్యంలో సుమారు గంటపాటు నిర్వహించిన వివిధ యోగాసనాలను ప్రజలతో కలి సి మంత్రి చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భారతదేశ ప్రాచీణ సంస్కృతి నుండి వచ్చిన యోగాను ప్రపంచంలోని 193దేశాల్లో యోగా దినంగా జూన్ 21న పాటిస్తున్నాయని తెలిపారు. యోగా వల్ల ఎన్నో లాభాలున్నాయని, ప్రతీఒక్కరూరోజు ఉదయం 5గంటల నుండి 8గంటల నుండి యోగాసనాలు వేయాలన్నారు. యోగావల్ల మనస్సు, శరీరం, మనోభావాలను సంతులనంగా ఉంచవచ్చన్నారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ శశిధర్‌రాజు, అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి, డిఆర్వో రమేష్ రాథోడ్,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీనివాస్, ఆయూష్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు, నోడల్ అధికారి రవీంధర్‌రెడ్డి, నర్సారెడ్డి, ఫరీదా, టీఎన్జీవో నాయకులు ప్రభాకర్, డాక్టర్ యు.కృష్ణంరాజు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతం అవసరం
* జిల్లా కలెక్టర్ దివ్య

ఆదిలాబాద్, జూన్ 21: ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది ఏలాంటి ఒత్తిడి, ప్రలోభాలకులొంగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో స్టేజ్ టూ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్ర మంలో కలెక్టర్ మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏవిధంగా చేపట్టాలనే విషయాలకు సంబంధించిన బుక్‌ను అందించడం జరిగిందని, వాటిని చదవడం వలన పూర్తిగా అవగాహనతో ఎన్నికల విధులు నిర్వర్తించవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణలో ముఖ్యంగా బోగస్ ఓటర్లు ఓటు వేయకుండా నిరోధించడంతోపాటు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రకటించడం వంటివి సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికలను ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహించడానికి ఆయా రిటర్నింగ్ అధికారులకు ఆయా ఎన్నికల సమయాల్లో అధికారాలుంటాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో గాని, ఓట్ల లెక్కింపు సమయాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను నివృత్తి చేసుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికలను పారదదర్శకం నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుందన్నారు. అంతకు ముందు పలువురు ఎంపిడీవోలు ఎన్నికల విధులు, నిర్వహణలపై శిక్షణ ఇచ్చారు. పలువురు లేవనెత్తిన సమస్యలకు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో డిపివో జితేందర్ రెడ్డి, ఎంపిడీవోలు, ఈవో పిఆర్‌డిలు తదితరులు పాల్గొన్నారు.