అదిలాబాద్

యోగాతోనే ఆరోగ్యవంతమైన సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 21: మానసిక ప్రశాంతత, చక్కని ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ప్రతినిత్యం ప్రాణాయం, యోగా ఆసనాలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మావల అటవీ పార్కులో యోగా ఆసనాలు నిర్వహించగా, భారీ ఎత్తున ప్రజలు, యువకులు యోగా శిబిరానికి హాజరై ఆసనాలు వేశారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా సాదన ద్వారా ఆరోగ్యవంతులుగా జీవనం సాగించవచ్చని, శాస్త్రాలు సైతం చెబుతున్నాయని, సమాజంలో యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21న దేశవ్యాప్తంగా ఉత్సాహంగా యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా యోగా ఆసనాలు చేయవచ్చని, మనిషిలో ఏకాగ్రతతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనంతో పాటు వివిధ రకాల రుగ్మతలను కూడా దూరం చేయవచ్చని అన్నారు. శారీర ప్రక్రియతో పాటు శ్వాసక్రియకు ప్రాణాయమం ఎంతో అవసరమని, శారీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రాణాయమం ఎంతోగానో ఉపయోగపడుతుందని అన్నారు. మనస్సును స్థిరపర్చుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు రాజలింగం, ఉమారాణిలు యోగా సాధన ఆసనాలు నేర్పించారు. ఈ శిబిరానికి ఆర్డీవో సూర్యనారాయణ, డిఆర్‌డివో రాథోడ్ రాజేశ్వర్, డి ఎఫ్‌వో ప్రభాకర్, డిఎస్‌డివో వెంకటేశ్వర్లు, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నవ తెలంగాణ స్ఫూర్తిప్రదాత ప్రొఫెసర్ జయశంకర్
* వర్ధంతి సభలో లోక భూమారెడ్డి
ఆదిలాబాద్ టౌన్, జూన్ 21: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితానే్న త్యాగం చేసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడువాలని రాష్ట్ర డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు. జయశంకర్ అమర్‌హై.. జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి. ఈ సంధర్భంగా నివాళులర్పించిన అనంతరం లోక భూమారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం శాంతియుత వాతావరణంలో ఉద్యమానికి సారథ్యం వహించిన జయశంకర్‌తో ఆదిలాబాద్ జిల్లాకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. విద్యార్థులు, యువకులతో పాటు రాజకీయ పార్టీల్లోను తెలంగాన రాష్ట్ర ఆకాంక్షను నూరిపోశారని, ఉద్యమానికి ఊపిరి పోసిన జయశంకర్ స్ఫూర్తితోనే నవ తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆయన చూపిన బాటలో తమ పార్టీకూడా సిద్దాంతిక వ్యూహాలతో ముందుకు సాగుతుందని అన్నారు. ఆయన పార్టీకి, రాష్ట్ర సాధనకు చేసిన సేవలను ప్రతి ఒక్కరు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మావల సర్పంచ్ రఘు, మండల అధ్యక్షుడు రాజేశ్వర్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు.