అదిలాబాద్

కల్తీ బీర్ల విక్రయాలపై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూన్ 23: నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలోని బెల్ట్‌షాపులో కల్తీ బీర్లు అమ్ముతున్నారని గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం మధ్యాహ్నం సమయం లో అదే గ్రామానికి చెందిన వార్డు మెంబర్ లక్కవత్తుల నారాయణ కింగ్‌ఫిషర్ బీరు కొనుగోలు చేయగా, దాంట్లో మొత్తం పసుపువర్ణంతో కూడిన నాచులాంటి పదా ర్థం కనబడడంతో బెల్టుషాపు నిర్వాహకుడిని అడగగా బీర్లలో ఇలానే వస్తాయని చెప్పాడు. అంతేకాకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండని సమాధానం చెప్పడంతో ఈ విషయం గ్రామస్థులకు తెలపగా, లింగాపూర్ గ్రామానికి చెందిన పాండ్వాపూర్ సింగిల్‌విండో వైస్ చైర్మన్ గంగాధర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సీఐ సంపత్‌కృష్ణకు ఫిర్యాదుచేశారు. గతంలో కూడా ఇక్కడ కల్తీ బీర్లతోపాటు కల్తీ మద్యం దొరికిందని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్సైజ్ సీఐ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గ్రామస్థులు బెల్టుషాపు వద్ద ఆందోళన నిర్వహిస్తుండడంతో ఎక్సైజ్ ఎస్సై సూర్యనారాయణ ఆధ్వర్యంలో బెల్టుషాపును సందర్శించి రూ.50 వేల విలువ గల మద్యంను సీజ్‌చేసి బెల్టుషాపు నిర్వహిస్తున్న కైరం నవీన్‌పై కేసు నమోదుచేసి మద్యం సీసాలను నిర్మల్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఆందోళనలో గ్రామస్థులు ఎం. రమేష్, బండపెల్లి బుచ్చిబాబు, బొడిగెల రవి, స్వామి, రాజు, తదితరులు ఉన్నారు. కల్తీ మద్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదుచేసిన పట్టించుకోవడం లేదని స్థానిక వార్డు సభ్యులు లక్కవత్తుల నారాయణ పేర్కొన్నారు. లింగాపూర్ గ్రామంలోని బెల్టుషాపులో విచ్చల విడిగా కల్తీ మద్యం అమ్మకా లు జరుగుతున్నాయని, అధికారులు ప ట్టించుకోకపోవడం, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని ఆయన కోరారు.
బెల్టుషాపు యజమానిపై కేసు
: ఎక్సైజ్ ఎస్సై
లింగాపూర్ గ్రామంలో బెల్టుషాపులో కల్తీబీర్లు లభ్యమవడంతో ఆ బెల్టుషాపుపై దాడిచేసి షాపులో ఉన్న 50 వేల రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను సీజ్ బెల్టుషాపు నిర్వహిస్తున్న కైరం నవీన్‌పై కేసు నమోదు చేశామని నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై సూర్యనారాయణ తెలిపారు. గ్రామం లో బెల్టుషాపు నిర్వహించడానికి ఎలాంటి అనుమతి లేదని ఆయన వెల్లడించారు.