అదిలాబాద్

సకాలంలో కురుస్తున్న వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, జూలై 7: మండలంలో వారంరోజులుగా కురుస్తున్న వర్షాలు మండల రైతులకు మేలు చేస్తున్నాయి. అయినా మండల రైతు ముఖంలో దిగులు వీడడంలేదు. జూన్ మాసంలో అంతగా వర్షాలు లేకపోవడంతో నాటిన పత్తి మొలకెత్తుతుందో లేదో అని ఆందోళన చెందిన మండల రైతులకు మంచి రోజులు వచ్చాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా, విత్తనాలు నాటిన తర్వాత వర్షం రాక దాదాపు 50 శాతం పత్తి విత్తనాలు మొలకెత్తలేదని వారంటున్నారు. ఏది ఏమైన ఈ సారి మండలంలో వర్షాల పరిస్ధితి బాగానే ఉందని వారంటున్నారు. మండలంలో ఈ సంవత్సరం రైతులు దాదాపు 30,964 వేల ఎకరాల భూమి సాగులోకి తీసుకొని వచ్చినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.అందులో 25 వేల ఎకరాలు కేవలం పత్తి పంట వేయగా మిగిలిన 6964 ఎకరాల భూమిలో అన్ని రకాల పంటలు వేసినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ పంటలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు బాగా మేలు చేస్తున్నాయని రైతులు అంటున్నారు.అయితే నాలుగైదు రకాల కంపెనిల విత్తనాలు నాటినా కేవలం మహికో కంపెని విత్తనాలు కొన్ని కంపెనీలకు చెందిన విత్తనాలు మాత్రమే మొలకెత్తలేదని రైతులు వాపోతున్నారు. ఈ కంపెనీల విత్తనాలు మార్కెట్‌లో దొరకకపోతే అధిక ధరలు చెల్లించి 1700 నుండి 2200 రూపాయలు వెచ్చించి వాటిని కొనుగోలు చేసినా లాభంలేకపోయిందని వారంటున్నారు. వారం నుండి ఎక్కడ లేనివిధంగా మండలంలో వర్షాలు కురుస్తుండడంతో మండల రైతులు పత్తి పంటకు వేస్తున్న ఎరువులు సైతం మంచి ఉపయోగపడుతున్నాయని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.సకాలంలో వర్షాలు కురుస్తున్నందున మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఎరువులు వేయడం,కలుపులు తీయడం వంటి పనుల్లో బిజి బిజిగా ఉంటున్నారు.మండలంలో గత సంవత్సరం ఈ సీజన్‌లోనే వర్షాలు కురవకపోవడంతో పంటకు నష్టం వాటిల్లి మండల రైతులు తీవ్రంగా నష్టపోవలసి వచ్చిందని,అయితే ఆ పరిస్ధితి ఇప్పడులేదని వారంటున్నారు.సాఫిగా పనులు చేసుకొంటున్నామని మండల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో పంటల మునక
* 300 ఎకరాల పంటనీటిపాలు * లబోదిబోమంటున్న రైతులు
భైంసా రూరల్, జూలై 7: మండలంలోని చింతల్‌బోరి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో దాదాపు 300 ఎకరాలు పంట నీటిపాలైంది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా నీరుచేరి పంటపొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. అప్పుడే మొలకెత్తుతున్న పంటలు నీటి పాలుకావడంతో రైతన్న దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మహాగాం గ్రామ సమీపంలో పంటపొలాలను అధికారులు ప్రాజెక్టులో ముంపునకు గుర్తించకపోవడంతో రైతన్నలు నష్టపోతున్నారు. అధికారుల తప్పిదాల వల్ల పంటలను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత సంవత్సరం నుండి అధికారులకు సమస్యలు విన్నవించినప్పటికి పట్టించుకోకపోవడంతో సమస్య తలెత్తుతుందని, పూర్తిస్థాయిలో నష్టపరిహారాన్ని గుర్తించి రైతుల పంటపొలాలను సర్వేచేసినట్లయితే ముంపుకు గురయ్యే ఫ్రాంతాలను గుర్తించే అవకాశం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గుండేగాం గ్రామ సమీపంలోని వాగులో సైతం నీరు చేరడంతో గ్రామ ఫ్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొనే్నళ్లుగా ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పటికి నత్తనడక నిర్మిస్తున్న ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మాణానికి నోచుకోకపోవడం, ముంపును ప్రకటించకపోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులు ముంపు ప్రదేశాన్ని సందర్శించి న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు.