అదిలాబాద్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూలై 20: రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని వంజర్, బీరవెల్లి గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. వంజర్ గ్రామంలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన భీమన్న దేవాలయానికి, రూ.10 లక్షలతో నిర్మించిన శ్మశానవాటికకు ప్రారంభోత్సవం చేశారు. బీరవెల్లి గ్రామంలో రూ.4లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటి భవనంకు, రూ.3లక్షలతో నిర్మించిన కుర్మ సంఘ భవనానికి, రూ.40లక్షలతో నిర్మించిన గిడ్డంగుల సముదాయానికి ప్రారంభం, రూ.16లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రగతిపథంలో ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తుందన్నారు. వృద్దులకు పింఛన్లు, ఒంటరి మహిళలకు, బీడి కార్మికులకు పింఛన్లు, ప్రతీ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్లా వెంకట్‌రాంరెడ్డి, ఎఫ్‌ఎసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, అడెల్లి దేవస్థానం చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ రమేష్, నారాయణరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్యాంసుందర్, ఎడీవో గంగాధర్, సహకార సంఘం అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోషకాలతో కూడిన భోజనం అందించండి
* జిల్లా కలెక్టర్ దివ్య సూచన
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, జూలై 20: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, చిన్నారులకు పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సిడిపివోలు, సూపర్‌వైజర్లతో పౌష్టికాహారంపై జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ గర్బిణీలకు పౌష్టికాహారం అందించే బాధ్యత అంగన్వాడీలపై ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాలు, బాలామృతం, కోడిగుడ్లు కేంద్రంలోనే గర్భిణీలకు, చిన్నారులకు తినిపించాలని సూచించారు. ఈ విషయంలో అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. సూపర్‌వైజర్లు, సిడిపివోలు ఈ విషయంపై నిరంతరం పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం అందించడమే కాకుండా పిల్లలకు చదువుతో పాటు ఆట పాటలను సైతం నేర్పాలన్నారు. ఈ విషయంపై సంబంధిత సూపర్‌వైజర్లు కేంద్రాలను పరిశీలించి, అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్ల బలోపేతానికి పటిష్టమైన ప్రణాళికలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రసవం సమయంలో పిహెచ్‌సిలకు వచ్చే గర్భిణీలకు అంగన్వాడీల సాయంతో భోజనం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో అమాయక గిరిజనులు మూడనమ్మకాలను నమ్ముతున్నారని, వారికి చైతన్యపర్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణ లోపం కారణంగా పౌష్టికాహార సరకులు సకాలంలో అందడం లేదని, బాలామృతం సరఫరాలో నిర్లక్ష్యం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఉట్నూరు డివిజన్‌లో శాఖాపరంగా భవనాలు మంజూరు చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా గాదిగూడ, నార్నూర్ మండలాల్లో సిగ్నల్స్ సమస్య ఉందని, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని పంపించుటకు అనుమతి ఇవ్వాలని సూచించారు. గిరిజన జిల్లాలో పనిచేసి ఇక్కడి ప్రేమానురాగాలు పొందాలన్నారు. కొత్తగా చేరే అంగన్వాడీ కార్యకర్తలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల రీజినల్ కో-అర్డినేటర్లు అత్తిలి సరోజ, కస్తాల ప్రేమల, డిబ్ల్యూవో మిల్కా, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల సిడిపివోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.