అదిలాబాద్

జిపిఆర్‌ఎస్ విధానం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, ఏప్రిల్ 28: శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనుల వే బ్రిడ్జిలు, సీ ఎస్‌పి చెక్ పోస్టుల వద్ద జిపిఎస్ ద్వారా బొగ్గు రవాణా సౌకర్యం నిర్వహిస్తున్నట్లు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎస్‌డి ఎం సుబాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ మేనేజర్ సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీపీ ఎస్ విధానం ద్వారా అన్ని గనుల లోడింగ్ పాయింట్ల వద్ద అధునాతన సాంకేతిక పద్ధతి ద్వారా లోడింగ్ అయ్యే వాహనాలను కెమెరాల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించి ఆ రికార్డును కంప్యూటర్‌లో భద్రపర్చడం జరుగుతుందని, అంతే కాకుండా అనుమతి పొందిన లారీల్లో మాత్రమే లోడింగ్ పాయింట్ వద్దకు వచ్చే విధంగా ఆర్‌ఎఫ్ ఐడి విధానంతో క్రమబద్ధీకరించడం జరిగిందని వారు తెలిపారు. ఈ విధానం ద్వారా అనుమతి పొందిన వాహనాల నెంబర్లు, వాహనాలు ఆయా పాయింట్ల వద్దకు రాగానే అక్కడే ఉన్న గేటు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుందని తెలిపారు. మరి ఏ ఇతర వాహనం వచ్చినపుడు ఆ గేటు తెరుచుకోవడం జరుగదని, దీంతో ఇతర వాహనాలు లోనికి వచ్చే అవకాశం లేదని తెలిపారు. అంతే కాకుండా లోడింగ్‌పాయింట్ వద్దకు వచ్చిన లారీ వివరాలు ఆటోమేటిక్‌గా కంప్యూటర్‌లో నమోదు అవుతాయని అక్కడ ఉన్న కెమెరాలు వివిధ రూపాల్లో ఆ లారీలను ఫోటోలు తీసి భద్రపర్చడం జరుగుతుందని, లారీ నెంబర్, డ్రైవర్ కోడ్, ఫోటో, లారీలోని వస్తువులు మొత్తం రికార్డు అవుతాయని తెలిపారు. ఈ విధానం సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా అమలు పరుస్తున్నామని తెలిపారు. జిపిఎస్ విధానం ద్వారా లారీలు వెళ్లే మార్గాన్ని కంప్యూటర్‌లో అనుసంధానించడం వల్ల దీంతో మార్గ మధ్యంలో లారీ వెళ్లే మార్గంలో వెళ్లనట్లయితే ఎస్‌ఎంఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా లారీలు, వాహనాలు మార్చడం కానీ, వేరే మార్గాల ద్వారా తరలించడం గానీ జరిగే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ పద్ధతితో అనుమతి పొందిన లారీలకు మాత్రమే ఆర్ ఎఫ్ ఐడి కార్డ్స్‌ను అమర్చడం జరుగుతుందని, దీని ద్వారానే గేటు తెరుచుకోవడం జరుగుతుందని, ఈ విధానం మొత్తం శాటిలైట్ అనుసంధానంతో మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుందని, నిర్దేశించిన మార్గాల్లోనే లారీలు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌వొటు జిఎం సత్యనారాయణ, డివైజి రాజేష్‌బాబు, సెక్యూరిటీ అధికారి వేణుమాధవ్, ఐటి కార్పొరేట్ మాలకొండయ్య పాల్గొన్నారు.