అదిలాబాద్

కేంద్ర నిధులతోనే ప్రాజెక్టులకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ , ఏప్రిల్ 28: జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో మగ్గుతున్న ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం (పిఎంకెఎస్‌వై) కింద రూ.1087 కోట్లు మంజూరయ్యాయని, కేంద్రం నిధులతోనే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అన్నారు. గురువారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన పథకంలో భాగంగా పెద్దమొత్తంలో నిధులు విడుదల చేయగా జిల్లాలో 6 ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. కొమరంభీం ప్రాజెక్టుకు రూ.560 కోట్లు, నిల్వాయి ప్రాజెక్టుకు రూ.137 కోట్లు, గొల్లవాగు ప్రాజెక్టుకు రూ.102 కోట్లు, రాళ్లవాగు ప్రాజెక్టుకు రూ.66 కోట్లు, మత్తడి వాగు ప్రాజెక్టుకు రూ.5.2 కోట్లు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుకు 120 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రైతుల సంక్షేమానికై ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జిల్లాను సస్యశామలం చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుందని, మొదటగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ తెరాస ప్రభుత్వం ఎలాంటి నిధులు రావడం లేదని అనడం సమంజసం కాదన్నారు. కేంద్ర సహకారం లేనిది అభివృద్ధి జరగదని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి రూ.85లక్షల చొప్పన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని, అదే విధంగా ప్రతి మున్సిపాలిటీకి రూ.24 కోట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు అరోపణలు చేయడం మానుకొని అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఒకవైపు కరవు పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతుంటే మరోవైపు ఖమ్మం జిల్లాలో జరిగిన తెరాస ప్లీనరి సమావేశానికి భారీ మొత్తంలో నిధులు ఖర్చుచేయడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించడంతో పాటు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా మారుమూల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో బిజెపి నాయకులు విజయ్‌సింగ్ షేకావత్, నాంపల్లి వేణుగోపాల్, గందె విజయ్‌కుమార్, జోగురవి, ఆకుల ప్రవీణ్, శ్రీనివాస్ యాదవ్, విజయ్, కె.సంతోష్ పాల్గొన్నారు.