అదిలాబాద్

ప్రతిపక్ష నాయకుల అసత్య ప్రచారాలు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 15: మంచిర్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పనులను చూసి ప్రజలు ఆదరిస్తున్నారని, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజక వర్గంలో తాను అభివృద్ది ప్రజా సంక్షేమం కోసం ఆహార్నీశలు పాటు పడుతున్నానని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చానని హామీల అమలు కోసం కృషి చేస్తునన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ది టి ఆర్ ఎస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని రాష్ట్రంలో ఏ వర్గాలు వెనకబడితనంలో ఉన్నాయో గుర్తించిన కేసిఆర్ వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి విజయవంతం అమలు చేస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ సాధన లో భాగంగా కేసి ఆర్ ప్రత్యేక విజయంతో పరిపాలన చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఆసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కేసిఆర్ పరిపాలనను మరోసారి కోరుకుంటే ఆయనను ఓడించేందుకు కుట్రలో భాగంగా టిడిపి, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏకమయ్యాయని, అయినప్పటికీ ఆటలు సాగవు అని అన్నారు. నియోజక వర్గంలో అభివృద్ది పనులు వేగవంతంకు తాను ప్రత్యేకంగా కృషి చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ నేతల జిమ్మిక్కు రాజకీయాలను ప్రజలు విశ్వసించరు అని అన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలు నచ్చకనే మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి స్వంత గూటికి వస్తుండటం గమనార్హం అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా నమ్మకంతో ఉండి మరోసారి గెలిపించేందుకు ముందుకు వస్తుండటం గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, జడ్పిటిసి ఆశాలత, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, కౌన్సిలర్‌లు పూదరి ప్రభాకర్, కారుకూరి చంద్రవౌలి, బగ్గని రవికుమార్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్‌లు యాదగిరి రావు , పెంట రాజయ్య, సాగే వెంకటేశ్వర్ రావు , నాయకులు తోట తిరుపతి, సుదమల్ల హరికృష్ణ, సింగతి మురళీ, గడప రాకేష్, యెర్రం తిరుపతి, పానుగంటి శ్రీనివాస్, పల్లే భూమేష్, గొంగళ్ల శంకర్, తదితరులు పాల్గొన్నారు.
నేడు మంచిర్యాల, చెన్నూర్‌లలో కేటీఆర్ సభ
మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలలో ఎన్నిక ల ప్రచారసభను నిర్వహిస్తుండగా మాజీ మంత్రి కేటి ఆర్ హాజరవుతున్నారని బహిరంగసభను విజయవంతం చేయాలని ఆ నియోజకవర్గ ప్రజలను కోరా రు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే సభ స్థలంలో ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దసంఖ్యలో జన సమీకరణకు టిఆర్‌ఎస్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ ఏర్పాట్లను ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ పరిశీలించారు. హెలిక్యాప్టర్ ల్యాండింగ్ ప్రాంతాన్ని పరిశీలన చేశారు.