అదిలాబాద్

బసవేశ్వరుని ఆశయాలు కొనసాగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 9: 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుని జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మ బసవేశ్వరుని 883వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఆర్డివొ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలకు మంత్రి ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బసవేశ్వరుడు బ్రాహ్మణ కులంలో జన్మించినప్పటికి కులరహిత సమాజం కోసం పాటుపడ్డ మహనీయుడని కొనియాడారు. దక్షిణ భారత దేశంలో భక్తి ఉద్యమాలకు, సంఘ సంస్కరణలకు తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు. ఏ కులము గొప్పది కాదని, అన్ని కులాలు సమానమేనని ప్రతిపాదించి ఆచరించిన మహనీయుడన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సేవా ప్రచారాన్ని ఉధృతంగా సాగించి కుల, మత, లింగ భేదాలను నిర్మూలిస్తూ వీరశైవాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకవచ్చాడని వివరించారు. వర్ణ వ్యవస్థను, బ్రాహ్మణ ఆధిక్యతను నిరంతరం వ్యతిరేకించేవారన్నారు. ఆయన ప్రారంభించిన అందరికి సహపంక్తి భోజనం..చాపకూడు సిద్ధాంతంగా బాగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. కల్లెడ రాజు బిజ్జులుని ఆస్థానంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ శైవ ప్రచారానికి ఆయన జీవితాంతం కృషిచేశారన్నారు. అంతేకాకుండా కాకతీయులు వీరశైవులుగా మారడంలో, శివాలయాలను నిర్మించడంలో బసవేశ్వరుని స్ఫూర్తి ఎంతో గొప్పదన్నారు. ఇంతటి ఘన చరిత్ర గల బసవేశ్వరుని జయంతి వేడుకలను తెలంగాణ తొలి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డివొ శివలింగయ్య, మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, టి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, లింగాయత్ సభ్యులు యు.్ఫణీంధర్‌రావు, సుభాష్‌రావు, దిగంబర్‌రావు, కామన్నపటేల్, పెంట దత్తాద్రి, రామేశ్వర్, అచ్యుత్‌రావులతోపాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.