అదిలాబాద్

భూ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, మే 13: శ్రీపాద ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కర్ణమామిడి గ్రామ నిర్వాసితులు జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్‌ను కోరారు. శుక్రవారం నిర్వాసిత గ్రామాలైన కర్ణమామిడి, పడ్తన్‌పల్లిలో ఆయన పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్బంగా నిర్వాసితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కర్ణమామిడి గ్రామంలో ఇంటి అడుగు స్థలానికి నష్టపరిహారం అందించలేదని, గ్రామంలో కేవలం 170మంది నిర్వాసితులకు మాత్రమే ప్లాట్లు కేటాయిస్తామనడం సరైంది కాదన్నారు. నిర్వాసితులందరికీ ఒకే చోట, ఒకేసారి ప్లాట్లు కేటాయించాలన్నారు. ఇంటి అడుగు స్థలంగా పది గుంటల స్థలాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పునరావాస కాలనీకి అదనంగా 40 ఎకరాల స్థలం అవసరం ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటి వరకు భూసేకరణ చేయలేదని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి కూలీ డబ్బులు చెల్లించాలన్నారు. దీంతో నిర్వాసితుల సమస్యలు విన్న జేసీ వీటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం పడ్తన్‌పల్లి పునరావాస కాలనీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో ఆయిషా మస్రత్‌ఖానం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పాండురంగా రావు, ఇరిగేషన్ డీ ఈ పోచమల్లు, సర్పంచ్‌లు, భూనిర్వాసితులు పాల్గొన్నారు.