అదిలాబాద్

చెరువుల పునరుద్దరణతో రైతులకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, మే 30: చెరువుల పునరుద్ధరణతో ప్రజలకు మేలు చేకూరుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మండలంలోని కనె్నపెల్లి, రెబ్బన్‌పల్లి, నెల్కివెంకటాపూర్ గ్రామాల్లో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్దరణ పనులను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు లాభం చేకూర్చేందుకు మిషన్ కాకతీయ పథకంతో తెలంగాణలోని 40వేల చెరువుల మరమ్మత్తులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. చెరువుల్లో నీరుంటే పంటలు సమృద్దిగా పండుతాయని రైతులకు లాభం చేకూర్చేందుకు ముఖ్యమంత్రి మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. చెరువు మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకోవాలని దాని ద్వారా పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని సూచించారు. ఈ సందర్బంగా రెబ్బన్‌పల్లి రైతులు మత్తడి పనిని సక్రమంగా నిర్వహించేలా అధికారులకు సూచించాలని కోరడంతో ఎమ్మెల్యే ఇరిగేషన్ డీ ఈతో మాట్లాడి రైతుల సూచనల మేరకు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసి ఎం ఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిపి గోళ్ల మంజుల రాజమల్లు, వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్, సహాకార సంఘం చైర్మన్ గడ్డం శ్రీనివాస్, సర్పంచ్‌లు రాజేశ్వరి సత్తయ్య, శ్రీనివాస్, టేకం కళావతి, మాజీ ఎంపిపి మోటపలుకుల గురువయ్య, తెరాస యూత్ మండలాధ్యక్షుడు శంకర్ రావు, రెబ్బన్‌పల్లి ఉప సర్పంచ్ బత్తుల శేఖర్, నాయకులు మంద రాకేష్, కనాక రాజయ్య, బొలిశెట్టి సత్యం పాల్గొన్నారు.