అదిలాబాద్

కడెం ప్రాజెక్టు ప్రధానకాలువ మరమ్మత్తు పనులను ప్రారంభించిన ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, మే 30: జిల్లాలోని ఐదు మండలాలకు సాగునీరందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువైన ఎడమకాలువకు రింగ్‌వాల్ హెడ్ రెగ్యులేటర్ సిస్టం నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 46 లక్షల 60 వేల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. కాగా సోమవారం కడెం ప్రాజెక్టు వద్ద ప్రధాన కాలువైన రింగ్‌వాల్ హెడ్ రెగ్యులేటర్ సిస్టం నిర్మాణం పనులను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రేఖ, దివాకర్‌లు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల క్రితం అధిక వర్షాలు కురియడంతో ఆ సమయంలో ఈ మెయిన్‌కెనాల్ రింగ్‌వాల్ హెడ్ రెగ్యులేటర్ సిస్టం వరదనీటికి చెడిపోవడంతో అప్పటి నుండి కాలువ నుండి సాగునీరందించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి వర్షాకాలంలో తాత్కాలికంగా మెయిన్ కెనాల్‌కు ఇసుక సంచులు వేసి మరమ్మత్తులు చేపట్టి ఈ కాలువ ద్వారా సాగునీరు ఆయకట్టుకు నీటిపారుదలశాఖ అధికారులు అందించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని తాము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం మెయిన్‌కెనాల్ రెగ్యులేటర్ మరమ్మత్తు పనులకు నిధులు మంజూరుచేసిందన్నారు. రాబోయే వర్షాకాలం సమీపిస్తుండడం వల్ల ఈ రెగ్యులేటర్ సిస్టం నిర్మాణం పనులు వేగవంతంగా సకాలంలో పూర్తిచేయాలని పనులు నాణ్యతగా చేపట్టాలని ఎమ్మెల్యేలు రేఖ, దివాకర్‌రావు నీటి పారుదలశాఖ అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే కడెం ఆయకట్టు ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగునీరు అందే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడెం మండల పరిషత్ అధ్యక్షురాలు బుక్య అమ్మి బాపురావు, కడెం ప్రాజెక్టు డి ఈ నూరొద్దిన్, ఎ ఈ శ్రీనాథ్, పెద్దూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల చిన్నయ్య, ఎంపిటిసి జాడి గంగాధర్, టి ఆర్ ఎస్ నాయకులు నల్ల జీవన్‌రెడ్డి, హపావత్ రాజేంధర్‌నాయక్, రవిగౌడ్, నల్లగొండ, మినాజ్‌హుస్సేన్, సాగర్, సురేష్‌నాయక్ పాల్గొన్నారు.