అదిలాబాద్

సామాజిక సేవలతో ప్రజలకు చేరువవుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 3: సామాజిక సేవలతో ప్రజలకు చేరువవుతూ పోలీసు సంస్కరణలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని వరంగల్ డిఐజి టి.ప్రభాకర్ రావు అన్నారు. ఇటీవలే నూతనంగా వరంగల్ రేంజ్ డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మొదటిసారిగా జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం పోలీసు విశ్రాంతి భవనంకు చేరుకున్నారు. ఈ సంధర్భంగా జిల్లా పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ పుష్పగుచ్చం అందించి డిఐజికి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో నేర సమాచారం తెలుసుకొనుటకు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా డి ఐజి టి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లా పోలీసులు తమ విధి నిర్వహణ అంశాలపై శాంతి భద్రతలు ఆధారపడి ఉంటుందని అన్నారు. పెండింగ్ కేసులు రోజువారి దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని, డివిజన్ పరిధిలో కేసులు పెండింగ్‌లో లేకుండా డిఎస్పీలు చర్యలు తీసుకోవాలన్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లా సరిహద్దులో నిరంతరం కూంబింగ్‌తో పాటు నిఘా వ్యవస్థను పటిష్టపర్చుకోవాలన్నారు. గ్రామస్థాయిలో పోలీసు వ్యవస్థను అందుబాటులో ఉంచాలని, తరుచుగా గ్రామ సభలు నిర్వహించి ప్రజా సంబంధాలు మెరుగుపర్చుకోవాలన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి తగిన ఉచిత శిక్షణ ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ నేరాలను నియంత్రించుటకు రాత్రి సమయంలో గస్తీతో పాటు పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్థాయికి మించి ప్రయాణికులను తీసుకవెళ్లే ఆటోలపై కేసులు నమోదు చేయాలని అన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా విక్రయ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నామని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, మంచిర్యాల ఏఎస్పీ యస్ యం విజయ్‌కుమార్, శిక్షణ ఐపిఎస్ అధికారి సునిల్ దత్, డిఎస్పీలు ఎ.లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి, టి.మనోహర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, డిసి ఆర్‌బి సిఐ గణపత్ జాదవ్, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.