అదిలాబాద్

నేడు డిప్యూటీ సిఎం మహమూద్ అలీ జిల్లా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 3: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ జిల్లా మంత్రులతో కలిసి శనివారం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ జగన్మోహన్ తెలిపారు. డిప్యూటి సిఎం ఉదయం 10.30 గంటలకు నిర్మల్ చేరుకుంటారని, 11 గంటలకు నిర్మల్‌లో వౌలాలు, ఇమామ్‌లకు గౌరవ వేతనం కింద చెక్కుల పంపిణీ చేస్తారని అన్నారు. తిరిగి మధ్యాహ్నం నిర్మల్ నుండి 3.15కు ఆదిలాబాద్ చేరుకొని ఇమామ్, వౌజాంలకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటి సిఎం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు జిల్లా అధికారులతో రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారని కలెక్టర్ వివరించారు. డిప్యూటి సిఎం వెంట జిల్లా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నలు పాల్గొంటారని తెలిపారు.