అదిలాబాద్

ఉద్యమకారులనే సన్మానించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూన్ 3: తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసి జైలు పాలైన ఉద్యమకారులనే సన్మానించామని, లేనిపోని ఆరోపణలు చేయడం మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి అవివేకానికి నిదర్శనమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచావన్నారు. ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఏ పనీ చేయలేదన్నారు. పట్టణంలోని భూదాన యజ్ఞ భూములను రియల్టర్లు కబ్జా చేస్తే నిద్రపోయావా అని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమిగా గుర్తించి స్వాదీనపరుచుకున్నామని తెలిపారు. భూకబ్జాదారులను సన్మానించారని మాట్లాడటం సరికాదన్నారు. తన తండ్రి అమ్ముకున్న కాలేజీ భూమిపై కోర్టుకెళ్లి విధిలేని పరిస్థితిలో విత్‌డ్రా చేసుకున్నావన్నారు. రాజకీయ అనుభవం లేక ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ కోసం తాళ్లపేట నుంచి పాదయాత్ర చేస్తే నడవలేని స్థితిలో ఉన్న నీవు ఇంటి వద్ద నిద్ర చేస్తే నేను ప్రజల మద్యనే ఉండి పాదయాత్ర చేశానని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ వసుందర, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, పట్టణ అద్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్‌రావు, కిషన్, కౌన్సిలర్లు చంద్రవౌళి, ప్రభాకర్, జగన్, షఫి, గౌరి ప్రియ, నాయకులు రవి, శేఖర్ పాల్గొన్నారు.