అదిలాబాద్

ఇంకిపోయిన చెరువులు - వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, జూన్ 3: మండలంలో ఏర్పడిన కరువువల్ల చిన్నచిన్న వాగులు, వంకలతోపాటు, చెరువులు ఇంకిపోయి పలు గ్రామాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడడంతో మండల ప్రజలు నీటి కోసం పడరాని తిప్పలుపడతున్నారు. ఇదిలా ఉండగా, మండలం చుట్టుపక్కల అడవుల్లో సైతం ఈ సంవత్సరం జంతువులకు తాగడానికి నీరు లభించక అనేక అడవి జంతువులు గ్రామాల్లో చుక్క నీటికోసం వచ్చి జనం చేతిలో బలవుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణతోపాటు వాటికి తాగు నీటి కోసం అడువుల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు చేపట్టకపోవడమే దీనికి కారణమని మండల వాసులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అడవి అభివృద్దిపనులతోపాటు అడవి జంతువులకు నీటి నిల్వ చేయడానికి చేపట్టవలసిన పనులను సైతం ముందుగా చేపట్టారు.వాంకిడి మండలంపై ఆ శాఖ ఉన్నత అధికారులు దృష్టి పెట్టకపోవడంతో వాంకిడి మండలంలోని చుట్టుపక్కల అడువుల్లో గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడంలేదని, స్ధానిక అధికారులు అడవి రక్షణతోపాటు, అటటీ జంతువుల సంరక్షణ కోసం చేపట్టే చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకొంటున్న వారు మాత్రం స్పందించడంలేదని వారంటున్నారు. ఇదిలా ఉండగా, మండలంలో వర్షపునీటిని ఒడిసి పట్టే చెక్ డ్యాములు, ఫార్మ్‌పాండ్స్, కందకాల తవ్వకాలు, రాళ్ళకట్టడాలు, చేపట్టకపోవడంతో జంతువులతోపాటు అడవుల దగ్గర ఉన్న గ్రామాలకుసైతం నీటికష్టాలు తప్పడంలేదని గిరిజనులు వాపోతున్నారు. మండల కేంద్రంలోనే దాదాపు 6 బావులు, 7 బార్వెల్లు ఇంకి పోయినాయంటే ఈ సంవత్సరం కరువు పరస్థితి ఎలాగుందో అర్ధమవుతోంది. ఇదిలాఉండగా, గత వర్షాకాలంలో అప్పుడప్పుడు కురిసిన భారీ వర్షాలకు మండలంలోని చికిలి వాగు పొంగి వరద నీరు ప్రాజెక్టు మత్తడి నుండి పారాయి. ఈ దృశ్యాం మండల వాసులకు ఇప్పటికీ కళ్ళముందర కదలాడుతుందని, అయితే నీటి రక్షణ చేయని కారణంగా చాలా గిరిజన గ్రామాల్లో కరవు పరిస్ధితులు కలవర పెడుతున్నాయి. రెండు సంవత్సరాల నుండి మండలంలో వర్షాలు సరిగ్గా కురవక పోవడంతో మండల ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మండలంలోని అతి పెద్ద చెరువు అయినటువంటి చికిలి వాగులోనే నీరు పూర్తిగా అడుగంటి పోయాయంటే ఇతర చెరువుల పరిస్థితిని మనం అర్ధం చేసుకోగలము. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయని ని మండల ప్రజలు ఎదురు చూస్తున్నారు.