అదిలాబాద్

7నుండి జిల్లాలో 3వ విడత ఇంద్రధనుష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 3: ఏడవ తేదీ నుండి జిల్లాలో నిర్వహించే మూడవ విడత ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్కరు మిగిలి పోకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో మూడవ విడత ఇంద్రధనస్సు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు సార్లు నిర్వహించిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలను కలెక్టర్ అభినందించారు. పిల్లలను 9 రకాల వ్యాధులకు గురికాకుండా వ్యాధి నిరోధక టీకాలు పనిచేస్తాయని, అందుకు గాను 3వ విడత మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా రెండేళ్ల పిల్లల నుండి గర్భిణీ స్ర్తిలు ఏ ఒక్కరు మిగిలిపోకుండా టీకాలు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, వి ఆర్‌వోలు, మహిళా సంఘాల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు. గ్రామాలలో వ్యాధి నిరోధక టీకాలు వేసే తేదీలు గ్రామ, పట్టణ ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం గావించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా శాసన సభ్యులు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి తొడసం చందు మాట్లాడుతూ జిల్లాలో 3వ విడత మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం జూన్ 7, 9, 10, 13, 14, 16 తేదీలలో నిర్వహించబడుతుందని అన్నారు. జిల్లాలోని 40 మండలాల్లో 1054 మంది రెండు సంవత్సరాలలోపు పిల్లలు, 194 మంది గర్భిణీ స్ర్తిలు ఉన్నట్లు గుర్తించామని, వీరిలో ఏ ఒక్కరు మిగిలిపోకుండా టీకాలు వేసి విజయవంతం పూర్తిచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి అల్హాం రవి, ఐసిడిఎస్ పిడి వెంకటేశ్వర్లు, డాక్టర్లు అతుల్, విక్రమ్, డిపిఎం స్వామి, డెమో వెంకటరాం నర్సయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.