అదిలాబాద్

బాపూలే ఆశయసాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 28: బడుగు బలహీనవర్గాల అభివృద్ధికోసం ఎన్నోసంస్కరణలు ప్రవేశపెట్టి సంక్షేమ ఫలాలు అందించిన గొప్ప మహానీయు డు మహాత్మాజ్యోతి బాపూలే అని, ఆయ న ఆశయాలను స్పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు సమాజానికి సేవలు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో మహాత్మాజ్యోతిబాపూలే 125వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి మాట్లాడుతూ 175 సంవత్సరాల క్రితమే దేశంమెచ్చేలా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికోసం సంస్కరణాలు తీసుకువచ్చి సమాజంలోఉన్న రుగ్మతలను ప్రారదోలిన గొప్ప మహానీయుడు జ్యోతిబాపూలే అన్నారు. వారి ఆశయాలను సాధించడానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కేంద్రంలో పూలేవిగ్రహం ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు కోసం కృషి చేస్తానని, అదేవిధంగా మండల కేంద్రాలలో జ్యోతిబాపూలే విగ్రహాలు స్థాపించడానికి తనవంతు కృషిచేస్తానన్నారు. జిల్లా బిసి సంక్షేమ అధికారి పి.మేఘనాథ్ మాట్లాడుతూ బడుగుబలహీనవర్గాల వారి అభ్యున్నతికోసం జ్యోతిబాపూలే తన జీవితానే్న త్యాగంచేశారన్నారు. పూలేను ప్రతిఒక్కరూ స్పూర్తిగా తీసుకొని తమ వంతు సమాజ సేవలో పాలుపంచుకోవాలన్నారు. జిల్లా బిసి సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసిల అభ్యన్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి జ్యోతిబాపూలే అన్నారు. జిల్లా నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.అశోక్ మాట్లాడుతూ ఆణగారినవర్గాలు, పేద ప్రజల అభ్యున్నతికోసం ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర మాలి సంఘం అధ్యక్షుడు పి.సుకుమార్ మాట్లాడుతూ జ్యోతిబాపూలే బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, గొప్ప సామాజికవేత్త అన్నారు. కార్యక్రమంలో జడ్పీ సిఈవో జితేందర్‌రెడ్డి, గ్రామజ్యోతి కో-అర్డినేటర్ రాజేశ్వర్ రాథోడ్, డిపివో పోచయ్య, బిసి సంఘం కార్యదర్శి కె.పార్థసారథి, ఎస్‌డబ్ల్యూ రాజేశ్వర్, రాజలింగం, సామాజిక కార్యకర్త బండారు దేవన్న, ఏవో ఐలయ్య, అన్నదానం జగదీష్, ఠాకూర్‌సింగ్, ప్రశాంత్, దళిత సంఘాల ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.