అదిలాబాద్

బెజ్జూరులో ఎడతెరిపి లేని వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూరు, జూలై 1: మండలంలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురుస్తుండటంతో జన జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. బెజ్జూరు మండలంలోని కుష్నపల్లి, కుకుడ, బెజ్జూరు వాగులు వర్షాల వల్ల ఉప్పొంగాయి. కుష్నపల్లి, కుకుడ వాగులు ఉప్పొంగడంతో సుమారు 15 గ్రామాల ప్రజలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాగులపై వంతెనలు పూర్తి కాకపోవడంతో ఈ ప్రాంత వాసులు నడుములబంటి లోతు నీళ్లలో బెజ్జూరు మండలానికి చేరుకోవాల్సి వస్తోంది. ప్రతీ పనికి మండల కేంద్రానికి రాక తప్పదు. కుష్నపల్లి వాగుపై రేచిని సమీపంలో ప్రభుత్వం రూ.7.50కోట్లతో వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణ పనులు ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా వంతెన అసంపూర్తిగానే ఉండటంతో సోమిని, మొగవెల్లి, కుష్నపెల్లి, గూడెం తదితర గ్రామాల ప్రజలకు వాగు దాటేందుకు కష్టాలు తప్పడం లేదు. కుకుడ వాగుపై ఇటీవల రూ.3.50కోట్లతో వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరై పనులు ప్రారంభమైనప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో కాకెపెల్లి, కుకుడ, బారెగూడ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారీ వర్షాల కారణంగా బెజ్జూరు మండలంలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ఏ గ్రామంలో చూసినా బురద రోడ్లే దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో నడవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మరీ అద్వాన్నంగా తయారైంది. మండలంలోని ఎల్కపల్లి, చిన్న చిత్తాపూర్, కమ్మర్‌గాం, కుకుడ తదితర గ్రామాల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. గురువారం రాత్రి కురిసిన వర్షానికి కమ్మర్‌గాం, పాపన్‌పేట గ్రామాల మద్య ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా మండలంలోని కుకుడ, కమ్మర్‌గాం, మొర్లీగూడ, బారెగూడ, దింద, గూడెం, సోమిని, ఇక్కపల్లి, తలాయి తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గుతున్నాయి. వర్షాల కారణంగా గ్రామాల్లో పారిశుద్ద్యం లోపించి వ్యాధులు ప్రభలే అవకాశాలు కనిపిస్తున్నాయి.