అదిలాబాద్

సంఘ విద్రోహశక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, జూలై 1: జిల్లా ప్రజలు సంఘ విద్రోహశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. వచ్చే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ మాట్లాడుతూ పండగలను శాంతియుత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని అన్నారు. సంఘవిద్రోహశక్తుల పట్ల పోలీసు అధికారులు నిఘా ఉంచాలని, జిల్లాలోని పోలీసు స్టేషన్లలో కుల, మత పెద్దలు, వివిధ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక శాంతి సంఘాలతో సమావేశమై ఆయా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేవిధంగా కృషి చేయాలని సూచించారు. ఆరాచకాలు సృష్టించే ఎంతటివారినైన ఊపేక్షించేది లేదని, ఇంటువంటి సంఘవిద్రోహ శక్తులను ఏరిపారేసేందుకు జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు. మసీదులు, దర్గాలు, ప్రార్థన స్థలాలు, మందిరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మత సామరస్యానికి ఆనవాలుగా వస్తున్న భైంసా, నిర్మల్, ఆదిలాబాద్ తదితర పట్టణ ప్రాంతాల్లో రంజాన్ పండగను ముస్లీం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం కల్పించే బాధ్యత పోలీసులు తీసుకుంటారని అన్నారు. జిల్లా ప్రజలు ఎటువంటి పుకార్లు నమ్మకుండా పోలీసులకు సమాచారం అందించాలని, పట్టణాల్లోని ప్రతి వార్డుకు జనమైత్రి పోలీసు అధికారిని నియమించామని అన్నారు. పండుగలను శాంతియుతంగా నిర్వహించినప్పుడే అభివృద్దికి బాటలు పడుతాయని ఎస్పీ పేర్కొన్నారు.