అదిలాబాద్

మండల ఏర్పాటులో అధికారుల తాత్సారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, జూలై 1: మండలంలోని కనె్నపెల్లి పంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కనె్నపెల్లి గ్రామానికి చెందిన యువకుడు అతిమేన సురేష్ (22) శుక్రవారం నాటి ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులు, నాయకులు మండల ఏర్పాటుపై స్పందించడం లేదని, నూతన మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే, ఎంపిలు హామీ ఇస్తేనే ట్యాంకు పై నుంచి దిగుతానని భీష్మించుకు కూర్చున్నాడు. సమాచారం అందుకున్న మండల తహసిల్దార్ రాజన్న ఘటనా స్థలానికి వచ్చి యువకున్ని సముదాయించే ప్రయత్నం చేశారు. మండల ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని తహసిల్దార్ సూచించగా, తహసిల్దార్ హామీతో దిగి వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌తో ఫోన్‌లో విషయాన్ని తెలియపరిచి వివరించగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. అనంతరం యువకుడు మాట్లాడుతూ మూడు నెలల నుంచి మండల ఏర్పాటు కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యే చిన్నయ్యలు పట్టించుకోవడం లేదని, వారు స్పందించకపోతే ఆందోళన ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.