అదిలాబాద్

శ్రీరాంపూర్‌లో 100శాతం బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, జూలై 1: శ్రీరాంపూర్ డివిజన్‌లో జూన్ ముగింపు నాటికి 100శాతం బొగ్గు ఉత్పత్తి సాదించడం జరిగిందని శ్రీరాంపూర్ డీవైజీ ఎం (పర్సనల్) బీవీవీ ఎస్ ఎస్ ఎస్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 38.48 లక్షల టన్నులకు గాను, 38.43లక్షల టన్నులు సాదించినట్లు ఆయన తెలిపారు. డివిజన్‌లో ఆర్‌కె-7, ఆర్‌కె-8, ఎస్ ఆర్‌పి-3, ఓసిపి మినహా మిగతా అన్ని గనులు వందశాతం ఉత్పత్తి సాదించాయని తెలిపారు. ఆర్‌కె-5 గని 186శాతంతో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఆర్‌కె 6 గని 107 శాతం, ఆర్‌కె-7 గని 90శాతం, ఆర్‌కె న్యూటెక్ 101, ఆర్‌కె-8 98, ఎస్ ఆర్‌పి 1 గని 106, ఎస్ ఆర్‌పి-3 గని 93, ఐకె1 ఏ 100శాతం ఉత్పత్తి సాదించాయని తెలిపారు. అదే విధంగా శ్రీరాంపూర్ ఓసిపి 91శాతం ఉత్పత్తి సాదించడం జరిగిందని పేర్కొన్నారు. ఉత్పత్తి సాధనకు కార్మికులు, అధికారులు, యూనియన్ నాయకుల సమిష్టి కృషి వల్లే ఉత్పత్తి సాద్యమైందని, ఇదే స్పూర్తితో మున్ముందు కూడా కొనసాగించి శ్రీరాంపూర్ ఏరియాను సింగరేణి సంస్థలోనే ప్రథమ స్థానంలో ఉంచాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ ఎం కిరణ్‌కుమార్, ఈ అండ్ ఎం ఫణి పాల్గొన్నారు.