అదిలాబాద్

న్యాయమూర్తుల సస్పెన్షన్ ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూర్, జూలై 1: చెన్నూర్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెదెపా జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ మాట్లాడుతూ ప్రత్యేక హై కోర్టు కావాలని చేస్తున్న న్యాయమూర్తుల సమ్మెకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. న్యాయమూర్తుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమండ్ చేశారు. ఇప్పటి వరకు సస్పెండ్ చేసిన న్యాయమూర్తులపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. ప్రత్యేక హై కోర్టు కావాలని ఉద్యమం చేస్తున్న న్యాయమూర్తులను సస్పెండ్ చేసి పుండు మీద కారం చల్లినట్లు ఈ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ జోక్యం చేసుకొని తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఆంద్రప్రదేశ్‌కు హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియేట్ తదితర అంశాలకు చెందిన ఆర్థిక నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, నాయిని మదునయ్య, గౌస్ పాల్గొన్నారు.