అదిలాబాద్

వర్షాలతో పొంగుతున్న వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుభీర్, జూలై 1: గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు ఊతమిచ్చినట్లయింది. తీవ్ర కరువు ప్రభావానికి మండే ఎండలు తోడుకావడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగినట్లు మండల వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కుంటలు, చెరువులు నీటి కలను సంతరించుకోగా గత మూడేళ్ల తర్వాత కస్రా వాగు నిండుగా ప్రవహిస్తుంది. పలుచోట్ల వర్షపునీరు పంటచేనులలో మడుగులు కట్టాయి. ఈ వర్షాకాలం ఇలాగే ఉంటే ఈసారి రైతులు కరువు ఛాయల నుండి బయటపడే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు.