అదిలాబాద్

షాదీ ముబారక్ అక్రమాలపై ఎసిబి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, మార్చి 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా షాదిముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టగా ఆ పథకం దుర్వినియోగం అవుతుందన్న ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం ఎసిబి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కాశయ్య స్థానిక రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టగా పలువిషయాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు షాదీ ముబారక్ పథకం కింద 70 మందికి రూ.51వేల చొప్పున అందజేయగా, వారిలో 20 మంది లబ్దిదారుల వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇతర లబ్దిదారుల వివరాలు లేకపోవడంతో వాటిపై లోతుగా విచారణ చేపట్టారు. ఈ సంధర్భంగా సి ఐ కాశయ్య మాట్లాడుతూ ప్రతి మండలంలో షాదిముబారక్ పథకం అమలుపై విచారణ చేపడుతున్నామని, పలు మండలాల్లో పథకం దున్వినియోగం అయినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఉట్నూరు మండలంలో సైతం షాదిముబారక్ పథకం వివరాలు సరిగ్గా లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. ఈ విచారణలో రెవెన్యూ సిబ్బంది మహేందర్ పాల్గొన్నారు.