అదిలాబాద్

అంతరిస్తున్న చేనేత వస్త్రాలను ఆదరిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మార్చి 18: అంతరించిపోతున్న చేనేత వస్త్రాలను, హస్తకళలను ఆదరించి, సమాజంలో వాటికి పునర్‌వైభవం తీసుకురావాల్సిన బాధ్య త ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శుక్రవారం తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ అధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రైతు బజారు సమీపంలో ఏర్పాటు చేసిన హస్తకళలు, చేనేతవస్త్రాల విక్రయ మేళా ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 2 లక్షల మంది చేనేత, హస్తకళల కళాకారులు జీవనాధారంగా ఉత్పత్తులు తయారుచేస్తున్నారని, ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. 10 రోజుల పాటు జరిగే ప్రదర్శనలో చేతివృత్తి వ్యాపారులకు మంచి ఆదరణనిచ్చి వస్తువులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని కోరారు. పది రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ సందర్భంగా వ్యాపారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పంచాలని వ్యవసాయ శాఖ ఎడి శ్రీనివాస్‌ను ఆదేశించారు. హస్తకళల అభివృద్ధి సంస్థవారు కోరిన విధంగా హస్తకళల అమ్మకాల అభివృద్ది కోసం జిల్లా కేంద్రంలో భవన స్థలం కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఎడి శ్రీనివాస్, హస్తకళల అభివృద్ధి సంస్థ బ్రాంచ్ మేనేజర్ కమలాకర్ రావు, సిడిసి మేనేజర్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.