అదిలాబాద్

భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెనె్నల, జూలై 24: మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. వర్షానికి మండలంలోని కుమ్మరివాగు, జోగాపూర్ మత్తడి వాగు, ఎర్రవాగు, ఖర్జి వాగులు పొంగి పొర్లడంతో ఎటు ప్రయాణీకులు అటే నిలిచిపోయారు. ముఖ్యంగా నెనె్నల, భీమిని, ఆవడం గ్రామాలకు వెళ్లే మధ్యలో బొప్పారం మధ్యలో ఉన్న రోడ్యాం పైనుంచి దాదాపు ఒక మీటరు మేర నీటి ప్రవాహం ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటు ప్రయాణీకులు అటు ఆగిపోయారు. గతంలో భారీ వర్షాలకు బ్రిడ్జి చెడిపోవడంతో మండల కో ఆప్షన్ సభ్యుడు మరమ్మత్తులు చేయించినప్పటికీ ఈ భారీ వర్షాలకు కొట్టుకుపోయి ఉంటుందని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. నీటిలో మునిగిపోయిన రోడ్ డ్యాం ఉందో, కొట్టుకుపోయిందోనని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ డ్యాం కొట్టుకుపోతే ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెంబేలు చెందుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, వందలాది మంది ప్రయాణీకులు వర్షంలో నిలబడి ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా పలు గ్రామాల్లో ఇండ్లలోకి వర్షం నీరు చేరి ఇండ్లు కూలిపోయాయి. ఇతర గ్రామాల్లో సైతం గుడిసెలు వానకు నేలమట్టం అయ్యాయి. చెరువులు నిండిపోవడంతో తెగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.