అదిలాబాద్

ఆర్జీల పరిష్కారానికి సత్వర కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూలై 25: గిరి దర్బార్‌కు వచ్చే ఆర్జీలను పరిష్కరించి సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులో భాగంగా సోమవారం గిరిజనుల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా గిరిజన దర్బార్‌కు వచ్చిన ప్రతి ధరఖాస్తులు ఏమేరకు పరిష్కారం అయ్యాయి, ఏ దశలో ఉన్నాయో శాఖల వారీగా సమీక్షించారు. అనంతరం ఇంద్రవెల్లి మండలం గినె్నర గ్రామానికి చెందిన కనకరావ్ వ్యవసాయ సాగుకు బ్యాంకు రుణం మంజూరు చేయాలని ఆర్జీద్వారా కోరాడు. తిర్యాణి మండలం తంగిడిమాత్ర గ్రామానికి చెందిన ఆత్రం దరంశావ్ తన జీవనోపాధి కోసం కిరాణ దుకాణం మంజూరు చేయాలని కోరాడు. ఇచ్చోడ మండలం పొన్న గ్రామానికి చెందిన దుర్వబావుబాయితో పాటు అక్కడి గ్రామస్తులు తమకు సంగీతంలో ప్రావీణ్యం ఉందని, మ్యూజికల్ త్రాస్‌బ్యాండ్ మంజూరు చేసినట్లయితే ఉపాధి పొందుతామని విజ్ఞప్తి చేశారు. నార్నూర్ మండల కేంద్రానికి చెందిన మెస్రం ఆశోక్ తాను నిరుద్యోగినని, జీవనోపాధి కోసం మ్యాక్స్ జీబును మంజూరు చేయాలని వేడుకున్నారు. వీరే కాకుండా మరో రెండు వందల మంది తమ తమ సమస్యలతో పివోకు ఆర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఐలయ్య, డిడి రాంమూర్తి, ఏపివో జనరల్ నాగోరావు, ఏవో భీం తదితరులు పాల్గొన్నారు.