అదిలాబాద్

నాటిన మొక్కలకు రక్షణ చర్యలేవీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 25: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోకపోవడంపై ఆదిలాబాద్ డిఎఫ్‌వో మోహన్‌పై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంతో పాటు జైనథ్, ఆదిలాబాద్ మండలాల్లో హరితహారం కింద భారీ ఎత్తున అధికారులతో కలిసి మంత్రి రామన్న మొక్కలు నాటారు. అంతకు ముందు ఉదయం దుర్గానగర్ కాలనీలోని ఫారెస్ట్ బ్లాక్‌లో ఈనెల 8వ తేదీన అటవీ శాఖ అధ్వర్యంలో నాటిన సామూహిక మొక్కల పెంపకాన్ని మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. అయితే కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోయి ఉండడం, ఉన్నమొక్కలకు రక్షణ వలయాలు లేకపోవడం, కనీసం చెట్టు వంగిపోకుండా సపోర్టుకర్రలను ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి రామన్న సంబంధిత డి ఎఫ్‌వో మోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధికారులకు మొక్కలు నాటడంపై ఉన్న శ్రద్ద వాటి పరిరక్షణపై లేకుండా పోయిందని, ఇలాగైతే హరితతెలంగాణ ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. దుర్గానగర్ ప్లాంటేషన్ క్షేత్రంలోకి పశువులు చొరబడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని లిటిల్‌స్టార్ హైస్కూల్‌లో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొని, చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా తరుణి అనే చిన్నారి పుట్టిన రోజు కావడంతో మంత్రి ఆ చిన్నారికి ఓ మొక్కను బహుమతిగా అందించి, తల్లిదండ్రులతో కలిసి నాటారు. పాఠశాల విద్యార్థులు పిల్లల జన్మదినం రోజు తప్పనిసరిగా ఒక మొక్క నాటేలా చర్యలు తీసుకోవాలని డిఈవో సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలను బ్రతికించుకుంటే ముఖ్యమంత్రి ఆశయం సిద్దిస్తుందని అన్నారు. అనంతరం కె ఆర్‌కె కాలనీ కుంట చెరువుగట్టుపై 350 ఈత మొక్కలను అధికారులు, గీత కార్మిక సంఘం అధ్వర్యంలో నాటారు. కొత్తగా కాకతీయ మిషన్ ద్వారా పునరుద్దరించిన ఈ చెరువు ద్వారా 47 ఎకరాలకు ఆయకట్టు లభిస్తుందని, ఈ సంవత్సరం 25 ఎకరాలు సాగులోకి వస్తుందని ఇరిగేషన్ డి ఈ సుశిల్‌కుమార్ మంత్రికి వివరించారు. చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయని, వీటి గట్ల వెంట ఈత వనాలు పెంచాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా కల్లుగీత కార్మిక సంఘాలు, ఎక్సైజ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయ సహకారంతో మొక్కలను బతికించుకోవాలని అన్నారు. మొక్కలు నాటడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తే తాము చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అనంతరం జైనథ్ మండలం సిర్సన్న గ్రామం వరకు ఇరువైపుల నాటిన మొక్కల పరిస్థితిని గమనించి ఇప్పటి వరకు కంచె, ట్రిగార్డ్స్ ఏర్పాటు చేయకపోవడంపై పిఆర్ ఇంజనీరింగ్ అధికారిని మంత్రి నిలదీశారు. ఏడు కి.మీటర్ల రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని, భవిష్యత్తులో రోడ్డుకు ఇరువైపుల చెట్లు కోల్పోకుండా చూడాలని మంత్రి సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15కోట్ల 40 లక్షల మొక్కలు నాటడం జరిగిందని మంత్రి అన్నారు. అనంతరం కలెక్టర్ జగన్మోహన్‌తో కలిసి లాండసాంగ్వి క్రాస్‌రోడ్డు వద్ద, చాందాటి గ్రామం వద్ద హరితహారం కింద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, జడ్పీటీసీ అశోక్, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్‌వో శ్రీనివాస్, ఎంపిడీవో రాథోడ్ రవిందర్ తదితరులు పాల్గొన్నారు.