అదిలాబాద్

కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూలై 27: ఆదిలాబాద్ జిల్లాలోని అతి పెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రెండు మూడు రోజుల నుండి ప్రాజెక్టు జలాశయంలో వేలాది క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతుండడంతో ప్రాజెక్టు జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా దాదాపు 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండడంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై బుదవారం కడెం ప్రాజెక్టుకు చెందిన 6,7 నంబరు గల వరదగేట్లను దాదాపు 8 ఫీట్ల వరకు పైకి లేపి 10 వేల క్యూసెక్కుల వరదనీరు గోదావరిలోకి వదిలారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో వరదనీరు జలాశయంలోకి వచ్చిచేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూ వస్తుందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. కాగా కడెం ఆయకట్టు కింద పంట పొలాలకు సాగునీరు అందించే ప్రధాన కాలువ అయిన ఎడమకాలువకు 600 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువకు 16 క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా సరఫరా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండడంతో కడెం ప్రాజెక్టు ఈ ఈ వెంకటేశ్వర్‌రావు, డి ఈ నూరొద్దిన్, ఎ ఈలు శ్రీనాథ్, రాజు, సిబ్బందితో మకాంవేసి అక్కడనే ఉండి నీటి మట్టం పెరుగుదల సమాచారాన్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ వారి సలహాలు, సూచనలను పాటిస్తున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 696.800 అడుగులకు ఉందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు చెందిన రెండు వరదగేట్లు ఎత్తివేయడంతో బుధవారం భారీ ఎత్తున పలు ప్రాంతాల నుండి పర్యాటకులకు ప్రాజెక్టు నుండి గోదావరిలోకి పరవళ్లు తొక్కుతున్న నీటిని తిలకించారు. దీంతో ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున పర్యాటకుల సందడి కనిపించింది.