అదిలాబాద్

గంగాపూర్ అడవులను సందర్శించిన అడిషినల్ పిసిసిఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూలై 27: మండలంలోని ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గంగాపూర్, లక్ష్మిపూర్ అడవుల్లో బుధవారం రాష్ట్ర అటవీ శాఖ అడిషినల్ పిసిసి ఎఫ్ మధుసుదన్‌రావు, కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ గుప్తలు పైగ్రామాల్లోని అడవులను సందర్శించారు. పైగ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటుచేసిన పలు అభివృద్ధి పనులపై అడిషినల్ పిసిసిఎఫ్ ఆరాతీశారు. గంగాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మాణం చేసిన చెక్‌డ్యాం, పాండ్వాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మించిన వాష్ టవర్, లక్ష్మిపూర్ అడవుల్లో నిర్మించిన చెక్‌డ్యాం, గంగాపూర్ అడవుల్లో నిర్మించిన చెక్‌డ్యాంలను అడిషినల్ పిసిసిఎఫ్ సందర్శించి అక్కడచేపట్టిన పలు అభివృద్ధి పనులపై ఆయన పరిశీలించారు. చేపట్టిన అభివృద్ధి పనులు వన్యప్రాణుల కోసం ఎంతవరకు ఉపయోగంలోకి వస్తాయన్న ఉపయోగంపై ఆయన ఆరా తీశారు. పైగ్రామాల్లోని అడవుల్లో చేపట్టిన పనులపై అడిషినల్ పిసిసి ఎఫ్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట నిర్మల్ డిఎఫ్‌వో రాంకిషన్‌యాదవ్, జన్నారం డిఎఫ్‌వో రవీందర్, ఎఫ్‌ఆర్‌వో నాగయ్య, గంగాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నజీర్ ఖాన్, గంగాపూర్ ఎఫ్‌బివో దుర్గం ప్రభాకర్, పాండ్వాపూర్ ఎఫ్‌బివో కీర్తిరెడ్డి, లక్ష్మిపూర్ ఎఫ్‌బివొ కృష్ణచైతన్య తదితరులు ఉన్నారు.