అదిలాబాద్

ఎంసెట్ లీకేజీపై ప్రభుత్వం బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జూలై 28: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంసెట్ 1,2 పేపర్ లీకేజీ ప్రధాన నిందితుడు రాజగోపాల్ రెడ్డి,ఎంసెట్ కన్వీనర్ రమణారావు,విద్యా,వైద్య రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి,లక్ష్మారెడ్డిల పొటోలతో కూడిన ఫ్లెక్సిలను పట్టణంలోని బజార్ ఏరియాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్ చిలుముల కృష్ణ దేవరాయులు మాట్లాడుతూ చాలమంది విద్యార్థులు కష్టపడి ఎంసెట్ 1,2 పరీక్ష రాశారని ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం, నిర్వాహణలోపం వల్ల ఎంసెట్ పేపర్‌లు లీకయ్యాయని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుని నిందితులను, 74మంది విద్యార్థుల తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ లీకేజి కారణమైన మంత్రులను బర్తరఫ్‌చేసి వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని 74మంది విద్యార్థుల ర్యాంకులను రద్దుచేసి వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని అంతేకాకుండా ఈ లీకేజితో సంబంధం ఉన్న కోచింగ్ సెంటర్‌లను సీజ్ చేసి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థులను మినహయించి మిగితా విద్యార్థులకు కౌనె్సలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగ్ కన్వీనర్ నాయిని మురళి శ్రావణ్, కళాశాలల ఇన్‌చార్జి హిమవంత్, నాయకులు అఖిల్, సాయి తదితరులు ఉన్నారు.