అదిలాబాద్

నాణ్యమైన విద్యుత్‌తో రైతులకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ రూరల్, జూలై 29: ప్రభుత్వం అందిస్తున్న 9 గంటల నాణ్యమైన విద్యుత్తుతో రైతులకు మేలు చేకూరుతుందని రాష్ట్ర గృహా నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.మండలంలోని ముఠాపూర్, పాక్‌పట్లలో శుక్రవారం 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌లను ప్రారంభించారు. 90 వేల నీటి సామర్ద్యంగల నీటి ట్యాంకుకు శంకుస్ధాపన చేసి హరితహారం మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సాధ్యమైందన్నారు. గతంలో ఆంధ్ర ప్రాంత పాలకుల హయంలో నిరాధారణకు గురై చీకట్లలో కాలం వెళ్ళతీసామన్నారు. ప్రస్తుతం నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రైతుల బతుకుల్లో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. ధీమాగా పంటలను పండించుకోవాడానకి ఆస్కారం ఎర్పడిందన్నారు.జిల్లాలో 42 విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కోన్నారు.రూ 1770 కోట్లతో 4 జిల్లాల్లో మిషన్ భగీరథ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి తాగు నీరందనుందన్నారు. ఇంటింటికి తాగు నీరు ప్రతి పోలం గట్టుకు సాగు నీరందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు.ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కను బతికించేందుకు బాధ్యత తీసుకోవాలని కోరారు. ముఠాపూర్ వెంకటేశ్వర ఆలయ అభివృద్ది పనులకు రూ.30 లక్షలు, పాక్‌పట్ల భీమన్న ఆలయానికి రూ.10 లక్షలు మంజూరి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో సర్పంచులు చంద్రశేఖర్, అన్ప లక్ష్మీలు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ దేవేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మెన్ జీవన్ రెడ్డి, ఎంపిటిసి మహేశ్ రెడ్డి , నాయకులు ముత్యం రెడ్డి పాల్గొన్నారు.