అదిలాబాద్

మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణచాంద, జూలై 29: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీటిని అందించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని వెల్మల్ బొప్పారం గ్రామంలో రూ.409.40 లక్షలతో చేపట్టనున్న 29 ఆవాస ప్రాంతాల గ్రామలకు అంతర్గత నీటి సరఫరా పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పనులు చురుకుగా సాగుతున్నాయని, రాబోయే రెండేళ్లలో తాగునీరు అందిస్తామన్నారు. అలాగే మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే పునరుద్దరించిన చెరువులకు పూర్వవైభవం చేకూరిందన్నారు. సాగు, తాగునీటికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సుజాత, జడ్పిటిసి పద్మ, నిర్మల్ మార్కెట్ కమిటి చెర్మెన్ దేవేంధర్‌రెడ్డి, ఎఫ్‌ఎసిఎస్ చైర్మెన్ రాంకిషన్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూ ఎస్ సి ఈ జగన్‌మోహన్, తహసిల్దార్ నారాయణ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు.